టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటోంది. ఇక ఫిబ్రవరి 14 న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రచారకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హీరోయిన్స్ కి సంబంధించిన పోస్టర్స్ ని వరుసగా రిలీజ్ చేశారు. ఇక విజౌ దేవరకొండ లుక్ ని ఇంతకముందే రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్స్ కి పాజిటివ్ కంటే కూడా కాస్త నెగిటివ్ కామెంటే ఎక్కువగా వినిపించాయి. అర్జున్ రెడ్డి సినిమా నుండి విజయ్ మారలేదని అదే రగ్డ్ లుక్..అవే లిప్ కిస్ సీన్స్ ..అదే యారగంట్ బిహేవియర్ అన్న కామెంట్స్ పడ్డాయి. అయినా చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో కొన్ని సమస్యలు వస్తున్నాయట.

 

ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉందని.. సినిమా ఫ్లోకు అడ్డంగా ఉన్న కొన్ని సీన్లను కట్ చేస్తూ రన్ టైమ్ ను క్రిస్పీగా చేసే పనిలో దర్శకుడు క్రాంతి మాధవ్.. ఎడిటర్ బిజీగా ఉన్నారని సమాచారం. అయితే రన్ టైమ్ బాగా ఎక్కువగా ఉండడంతో తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక కొన్ని సీన్లు కథకు ముఖ్యమైనవని అయితే ఆ సిన్న్స్ బాగా స్లోగా ఉండడంతో ఆ సీన్స్ ని ఏం చేయాలనే అలోచిస్తున్నారట. దీంతో ఎడిటింగ్ కోసం ఎక్కువ సమయం పడుతోందని సమాచారం. కాకపోతే రిలీజ్ కు ఇంకా 20 రోజుల వరకు సమయం ఉంది కాబట్టి ఎడిటింగ్ జాగ్రత్తగా చేస్తున్నారట.

 

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా రాశి ఖన్నా.. కేథరిన్ ట్రెసా.. ఐశ్వర్య రాజేష్.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎ వల్లభ నిర్మిస్తున్నారు. కె యస్ రామారావు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ రచయితగా కనిపిస్తాడని చెబుతున్నారు. ప్రస్తుతం విజయ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ముంబాయి లో మొదలైంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: