సంక్రాంతి సినిమాలు విడుదల కాక ముందు ఓవర్సీస్ లో మన సినిమా పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. లాభాల సంగతి అలా ఉంచితే. కనీసం మన మేకర్స్ పెట్టిన పెట్టుబడి తిరిగి తీసుకొచ్చే సినిమాలు లేక ఓవర్సీస్ మార్కెట్ డీలా పడిపోయింది. ఇక స్టార్ హీరోల సినిమాలకు నష్టాలు ఎక్కువ కావడంతో ఓవర్సీస్ రైట్స్ ధరలు కూడా బాగా తగ్గిపోయాయి. కాని 2020 సంక్రాంతి సినిమాలు మాత్రం ఓవర్సీస్ మార్కెట్ కు ధైర్యాన్నిచ్చాయి. ఒకవైపు 'అల వైకుంఠపురములో' భారీ కలెక్షన్స్ సాధిస్తుండగా మరోవైపు 'సరిలేరు నీకెవ్వరు' కూడా 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ మార్కెట్ పరిస్థితి కాస్త సెట్ అయిందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.

 

అయితే ఈ ఎఫెక్ట్ కొత్త సినిమాల పై పెద్దగా కనిపించడం లేదని తాజాగా వినిపిస్తున్న మాట. నాగశౌర్య నటించిన 'అశ్వథ్థామ' ఈ జనవరి 31 న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ఓవర్సీస్ లో పెద్దగా బజ్ రావడం లేదని తెలుస్తోంది. అంతేకాదు బిజినెస్ పరంగా ఇంకా అంతగా ఊపందుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ డల్ గా ఉండడంతో పాటు నాగ శౌర్య కు ముందు నుంచి లవర్ బాయ్ ఇమేజ్, క్లాస్ హీరోగా నేం ఉందని తెలిసిందే. మొదటిసారి 'అశ్వథ్థామ' లో శౌర్య యాక్షన్ హీరోగా గా నటించాడు. ఒకరకంగా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందోనన్న అనుమానాలు ఉన్నాయి. 

 

ఎందుకంటే ఇప్పటి వరకు శౌర్య కు టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే ఉంది. దాంతో ఈ కుర్ర హీరో సినిమాలు మినిమం గ్యారెంటీగా ఆడేవి. అలాంటిది ఒక్కసారిగా ఇలా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడం సాహసమేనని అంటున్నారు.  అయితే సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను మెప్పించి మాస్ హీరోగా ఆకట్టుకొని కొత్త క్రేజ్ ని క్రియోట్ చేసుకుంటాడా లేదా అన్నది 'అశ్వథ్థామ' రిలీజ్ అయితేగాని తేలదు. ఒకవేళ యాక్షన్ హీరోగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోతే మాత్రం ఇక నుండి కేవలం సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ తన మార్కెట్ ని ఇమేజ్ ని పెంచుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: