ఆర్.ఆర్.ఆర్ సినిమాని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలు కొమరం భీం, అల్లూరి సీతారామరాజులు గా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్- ఒలీవియా తారక్, చరణ్ లకి జోడీగా నటిస్తున్నారు. డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే స్లీపింగ్ పార్టనర్స్ గా రాజమౌళి- రామ్ చరణ్ ఉన్నారని ప్రచారమవుతోంది. అయితే ఇంత పెద్ద బడ్జెట్ ని మొత్తం ఈ ముగ్గురే పెట్టారా? లేక పైనాన్స్ ఇచ్చే బిగ్ షాట్ ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో మొదలయ్యాయి. అందులో భాగంగా ఓ బడా పారిశ్రామిక వేత్త పేరు తెరపైకి వచ్చింది.

 

గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా వెనుక బిగ్ షాట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అలానే పాన్ ఇండియా ఆర్.ఆర్.ఆర్ వెనుక ఓ పెద్ద వ్యాపారవేత్త ఉన్నారని... ఆయన ఓ టీవీ చానెల్ వోనర్ కం బిజినె మాన్ అని ప్రచారమవుతోంది. వాస్త్వానికి నిర్మాతగా దానయ్య ఉన్నప్పటికి.. తెర వెనుక పైనాన్స్ మ్యాటర్స్ ఆయనే సెట్ చేస్తున్నారట. అయితే దర్శకధీరుడిపై నమ్మకంతోనే ఆయన ఈ డేర్ స్టెప్ తీసుకున్నారని పైనాన్స్ కూడా గట్టి కండిషన్స్ తో అగ్రిమెంట్ రాసుకున్నారని టాక్ మొదలైంది.

 

ఇక ఆర్.ఆర్.ఆర్ సక్సస్ అయి భారీగా వసూళ్ళు రాబడితే అందులో ఎక్కువ షేర్ రాజమౌళి తో పాటు ఆ ఫైనాన్షియర్ కే వెళుతుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా మార్కెట్ నుంచి ఇప్పటికే 100 కోట్ల వరకు డిమాండ్ ఉందని తాజాగా ఉన్న సమాచారం. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్నందున.. అందునా రాజమౌళి సినిమా కాబట్టి వసూళ్లకు ఏమాత్రం ఢోకా ఉండదని బావిస్తున్నారు. దాదాపు 700 కోట్ల వరకు ఈజీగా రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: