చాలామంది పెళ్లి చేసుకున్న దంపతులు ఫస్ట్ నైట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. పెళ్లైన తర్వాత మూడు రాత్రులు మన దేశంలో శోభనం జరుగుతుంది. ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు పెళ్లైన జంట కోసం అన్ని రకాల వంటకాలు తయారు చేసి వారి జీవితంలో శోభనాన్ని మరిచిపోలేని రాత్రిగా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తారు. అయితే అటువంటి శోభనం అంటే ఒక ప్రాంతంలో  మాత్రం తెగ భయపడిపోతున్నారట. మేటర్ లోకి వెళ్తే బోర్నియో ఐలాండ్ ఆసియాలోనే మూడో అతిపెద్ద దీవి. సుమత్రా దీవులకు తూర్పు భాగంలో ఉన్న ఈ ఐలాండ్‌ను ఇప్పటివరకు ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. అయితే, ఇండోనేషియా, బ్రూనై, మలేషియాలకు చెందిన మూడు రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాన్నీ పాలిస్తున్నాయి.

 

ఇక ఫుల్ మేటర్ లోకి వెళ్తే ఈ ప్రాంతంలో ఆచారాల ప్రకారం పెళ్లయిన తర్వాత మూడు రోజులు గదిలోనే పెళ్లైన జంట ఉండాలని ఒక్కరోజులోనే వాళ్ళను ఈ ప్రాంత ప్రజలు బంధించడం జరుగుతుందట. గిరిజన ప్రాంతంగా పేరొందిన ఈ ప్రాంతంలో పెళ్లైన వధూవరులు కనీసం టాయిలెట్ కూడా బయటకు రాకూడదాట.

 

ఆ గదిలోనే మూడు రోజులు అలానే ఉండాలట కనీసం మల విసర్జనకు కూడా బయటకు రాకుండా బయట ఉన్న మనుషులు అడ్డుకుంటారాట. దీంతో కొత్త జంట మొదటిసారి గదిలో కలుసుకున్న గాని శృంగారంపై విరక్తి చెందే విధంగా వాతావరణం నెలకొంటుంది అని ఒకవేళ సెక్స్ చేసినా గాని శుభ్రం చేసుకోవడానికి పరిస్థితులు ఉండకపోవడంతో ఆ వధూవరులిద్దరు మూడు రోజులు గదిలోనే నరక యాతన పడతారట. అంతేకాకుండా గదిలో కూడా ఎటువంటి ఏర్పాట్లు ఉండవట. అయితే ఈ వాతావరణం అక్కడ ఆచారం ప్రకారం ఏది ఉన్నా లేకపోయినా ఇద్దరు మాత్రం కలసి ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ మూడు రాత్రులు పెళ్లైన జంట గడపాలని వారి ఉద్దేశం అంట. 

మరింత సమాచారం తెలుసుకోండి: