మాస్ మహారాజ రవితేజ, జ్యోతిక జంటగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా షాక్. ఈ సినిమా ఫ్లాపయినప్పటికి హరీష్ శంకర్ కి మాత్రం డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ రవితేజ తో మిరపకాయ్ సినిమాని తీసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన దబాంగ్ రీ మేక్ గబ్బర్ సింగ్ ఎన్ని సంచలనాలను సృష్ఠించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం, గద్దలకొండ గణేష్ తో ఒక మోస్తారు హిట్స్ ని అందుకొని కూర్చున్నాడు హరీష్. ఇక మన హరీష్ శంకర్ మాస్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు వివాదాస్పద విషయాలపై మాట్లాడి ఆ వివాదాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడంలో కూడా స్పెషలిస్టే. మిగతా దర్శకుల మాదిరిగా కాకుండా లౌక్యం అనే పదానికి హరీష్ చాలా దూరంగా ఉంటారు. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాడి నెత్తి మీదకు తెచ్చుకుంటాడు. ఇక ఈయన తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

హరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "నేనూ గెలవాలి ....All the Best నేను గెలవాలి .... ok..... నేనే గెలవాలి .... Sorry Boss...." అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సంక్రాంతి సినిమాల ఫేక్ కలెక్షన్లను ఉద్దేశించి వేసిన సెటైర్ అని ఎక్కువ మందికి అర్థం అయింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆ ట్వీట్ సూపర్ స్టార్ మేఅష్ బాబు సరిలేరు ..అల్లు అర్జున్ అల వైకుంఠపురమిలో సినిమాల గురించేనని ఇట్టే అర్థమైపోతుంది. అందుకంటే ఈ సంక్రాంతి సీజన్ లో వచ్చి కలెక్స్జన్స్ విషయంలో గొప్పలు పోతుంది ఈ రెండు సినిమా బ్యాచ్ లే. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ పంచ్ మహేష్ బాబు సినిమా పై అనుకున్నారు. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సెటైర్ అల్లు అర్జున్ సినిమా పై అనుకున్నారు. అంతేకాదు ఆ ట్వీట్ కింద కామెంట్ల లో ఒకరిని ఒకరు తిట్టుకోవడం మొదలు పెట్టారు. కొందరేమో ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల గురించి అంటూ మేథావుల తరహాలో ఊదరకొట్టారు. ఇక ఒక నెటిజన్ "ఈ ట్వీట్లు సరే నీ కొత్త సినిమా సంగతి చెప్పు బాసు" అని ట్వీటాడు. మరో నెటిజన్ "నెక్స్ట్ సినిమా అఖిల్ తో అంటున్నారు.. నిజమేనా?" అని అడిగాడు.

 

మొత్తానికి నేను ఈల వేస్తే గోలుకొండ అదిరిపడతది అన్నట్టు హరీష్ శంకర్ ట్వీటు చేస్తే నా సామి రంగ ఫ్యాన్స్ కొట్టుకోవడమే అన్నట్టు అయిపోయింది. ఏదేమైనా ఈ ట్వీట్ ఒక హాట్ టాపిక్ గా మారింది. ఆ ట్వీట్ ఏదో కాస్త ధైర్యం చేసి తన గురువుగారు ఆర్జీవీ లాగా ముక్కు సూటిగా పెట్టేస్తే అందరికీ అర్థం అవుతుంది కదా. భయపడి పెట్టలేదా ..మరి అలాంటప్పుడు పొలో మని బయలుదేరడం ఎందుకు. సైలెంట్ గా ఓ మూలన కూర్చుకొని స్క్రిప్ట్ రాసుకోవచ్చు కదా..! అంటు కొంతమంది రివర్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: