భారతదేశ సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా ప్రస్తుతం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమానే. బాహుబలితో జాతీయస్థాయి క్రేజ్ తెచ్చుకున్న మన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఒక కారణం. మరో కారణం ఇద్దరు సమఉజ్జీలైన టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ కావడం. ఇలాంటి సినిమాకు బడ్జెట్ కూడా ఎక్కువే. భారీ స్థాయిలో 350కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నట్టు నిర్మాత ప్రకటించాడు కూడా. ఇప్పుడీ ఖర్చు విషయంలో ఓ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

 

 

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఈ సినిమాకు ఫైనాన్షియర్ గా వ్వవహరిస్తున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంత భారీ బడ్జెట్ అంటే నిర్మాతకు ఆర్ధికంగా సహకారం ఉండాల్సిందే. అందుకే నిమ్మగడ్డతో ఒప్పందం కుదుర్చుకున్నాడట నిర్మాత దానయ్య. ఇండస్ట్రీలో ప్రముఖ ఫైనాన్షియర్లు తక్కువ వడ్డీకి ఇవ్వడానికి సుముఖత చూపకపోవడంతో నిమ్మగడ్డను ఆశ్రయించాడట. 1.50 వడ్డీకే ఆర్ఆర్ఆర్ కు నిమ్మగడ్డ ఫైనాన్స్ చేస్తున్నట్టు సమచారం. నిమ్మగడ్డ గతంలో బాహుబలికి కూడా ఫైనాన్స్ చేసినట్టు చెప్తున్నారు. ఈ స్నేహంతోనే ఆర్ఆర్ఆర్ కు కూడా ఫైనాన్స్ చేసినట్టు సమాచారం.

 

 

నిమ్మగడ్డ ప్రసాద్ సినిమాలు తీయకపోయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ తో వ్యాపారపరమైన సంబంధాలు బాగానే ఉన్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ కు ఫైనాన్స్ పెద్ద విషయం కాలేదనే అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం మంచి వైరల్ గా మారింది. దాదాపు 75శాతానికి పైగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైంది. అజయ్ దేవగన్, అలియా భట్ కూడా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ ఏడాదే ఆర్ఆర్ఆర్ భారీ స్థాయిలో విడుదల కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: