2008లో బాలీవుడ్ లో వచ్చిన 1920 అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆదా శర్మ, ఆ తరువాత తెలుగులో నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ అటాక్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఆ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆ తరువాత తెలుగులో ఆదాకు అక్కడక్కడా సినిమాల్లో చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. అనంతరం సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాల్లో నటించిన ఆదా, అనంతరం అడివి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణంలో మెయిన్ లీడ్ లో నటించి మంచి పేరు సంపాదించింది. 

 

కాగా ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో పాటు ఆదాకు కూడా పేరు తెచ్చిపెట్టింది. అనంతరం బాలీవుడ్ లో విద్యుత్ జమ్వాల్ హీరోగా తెరకెక్కిన కమాండో 2లో నటించిన ఆదా, ఆపై తెలుగులో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన కల్కిలో కూడా హీరోయిన్ గా నటించి ఇక్కడ మరొక హిట్ అందుకుంది. ఇక ఇటీవల విద్యుత్ తో కలిసి మరొక్కసారి కమాండో 3లో ఒక కీలక పాత్రలో నటించిన ఆదా, ఆ సినిమా కోసం పలు యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా పర్వాలేదనిపించేలా ముందుకు సాగింది. 

 

అయితే ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలో తనపై చిత్రీకరించిన ఒక పాటలో కొందరు మేల్ సైడ్ డాన్సర్స్ తో కలిసి రెయిన్ డ్యాన్స్ చేస్తూ, యద అందాలు కనపడేలా రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ గా తాను డ్యాన్స్ చేసిన వీడియోని కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఆదా. ఇక ఆ వీడియోని చూసిన పలువురు ఆమె ఫ్యాన్స్, వామ్మో ఈ విధంగా యద అందాలతో ప్రదర్శన చేస్తే కుర్రాళ్ళ మతులు పోతాయి కదా ఆదా అంటూ ఆమెపై సరదాగా కామెంట్స్  చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: