నిరుపమ్ ప‌రిటాల‌.. అన్న పేరు క‌న్నా కార్తీకదీపం సీరియ‌ల్ డాక్ట‌ర్ బాబు అంటే తెలుగు ప్రేక్ష‌కులు ఇట్టే గుర్తుప‌డ‌తారు. ఎందుకంటే ఆ సీరియ‌ల్ క్రేజ్ అలాంటిది మ‌రి. కార్తీక దీపం సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకుళ్తోంది. కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. అయితే ఈ దశలోనే సీరియల్‌లో మొదటి సీజన్ ముగింపునకు వచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాత్రి 7.30 అయ్యిందంటే టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్న ఈ మూవీ ఈ సీరియల్ జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్‌గా టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంది.

 

 ఇదిలా ఉంటే.. కార్తీక దీపం హీరో డాక్టర్ బాబు అంటే మహిళా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉంది. కార్తీక దీపం సీరియల్ టైటిట్ కేరక్టర్ అయిన కార్తీక్ గా నిరుపమ్ పరిటాల తనదైన నటనతో బుల్లితెరపై చెరగని ముద్ర వేశాడు. నిరుప‌ర్ బుల్లితెర‌పై ఎన్నో సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్నా.. కార్తీక‌దీపం సీరియ‌ల్ మాత్రం ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఈ సీరియల్ లో వంటలక్క అలియాస్ దీపకు ఎంత పేరైతే వచ్చిందో దాదాపు అంతే పేరు నిరుపమ్ సైతం సొంతం చేసుకున్నాడు. స్మాల్ స్క్రీన్ శోభన్ బాబుగా నిరుపమ్‌ను ఇండస్ట్రీలో కీర్తించడం గమనార్హం. 

 

కార్తీకదీపంలో డాక్టర్ బాబుగా అద్భుత నటన ప్రదర్శించే కార్తీక్ ఈ సీరియల్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తన యాక్టింగ్‌తో బయటపెడుతూ మంచి హైప్ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ నిరుప‌మ్ చేసిన టిక్ టాక్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ‘మందు మానేస్తా.. సిగరెట్ మానేస్తా.. ఫస్ట్ ఫ్లోర్‌లో అమ్మాయిని కెలుగుడు మానేస్తా’ అనే ఫేమస్ టిక్ టాక్ డైలాగ్‌ని డాక్టర్ బాబు చెప్తుంటే మనోడు మంచి కళాకారుడే, డాక్ట‌ర్ బాబు ద‌గ్గ‌ర చాలా లీల‌లు ఉన్నాయంటూ ర‌క‌ర‌కాల కామెంట్స్ పెడుతున్నాడు. మ‌రియు అల్లు అర్జున్ పాపులర్ డైలాగ్‌లతో పాటు మ‌రిన్ని డైలాగ్స్ న‌వ్వించాడు కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి: