రాజ్ తరుణ్ హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమా కొన్నాళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించింది. ఇక ఆ సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిన పునర్నవి భూపాలం, ఫస్ట్ మూవీతో ఆడియన్స్ దృష్టిని కొంతవరకు తనవైపుకు మరల్చుకుంది అనే చెప్పాలి. ఆ తరువాత మళ్ళి మళ్ళి ఇది రాని రోజు, మనసుకు నచ్చింది వంటి సినిమాలతో పాటు అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన పునర్నవి, ఆ తరువాత సడన్ గా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక కంటెస్టెంట్ గా ఎంపిక అయింది. 

 

ఇక అక్కడి నుండి ఆ షోలో తన తెలివితేటలతో బాగా ఆడిన పునర్నవి, షో సాగుతున్న సమయంలో తన కో పార్టిసిపెంట్ అయిన రాహుల్ తో ప్రేమలో పడ్డట్లు అప్పట్లో వార్తలు ప్రచారం అయ్యాయి. ఆ తరువాత ఆ షోలో ఫైనల్ విజేతగా రాహుల్ నిలవడంతో పాటు, వారిద్దరూ కలిసి కూడా అక్కడక్కడా కొన్ని మీడియా ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇవ్వడంతో వారి మధ్య ప్రేమ ఉందని, అలానే వాళ్లు అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు మరింతగా ప్రచారం అయ్యాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని, అంతేతప్ప మా ఇద్దరి మధ్య ఇంకేమి లేదని పునర్నవి, రాహుల్ మీడియాకు చెప్పడం జరిగింది. 

 

ఇక బిగ్ బాస్ తరువాత మరింత పాపులరైన పునర్నవి, ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ కు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ ఉంటోంది. ఇకపోతే నేడు స్లీవ్ లెస్ డ్రెస్ లో యోగా చేస్తూ యద అందాలు కనపడేలా దిగిన ఒక ఫోటోని ఆమె పోస్ట్ చేయడంతో ఆ ఫోటో వెంటనే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ గా మారింది. కాగా ఆ ఫోటో పై కొందరు ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు కొంత నార్మల్ గా ఉన్న పునర్నవి, ఒక్కసారిగా ఈ విధంగా హాట్ ఫోటోలు పోస్ట్ చేయడంతో తమ మతి పోతోందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరేమో మీరు ఈ విధంగా అందాల ప్రదర్శన చేస్తోంది సినిమాల్లో ఛాన్స్ ల కోసమేనా అంటూ సరదాగా ఆ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: