మూకీ సినిమాల స్థాయి నుండి నేడు 5డి సినిమాల రేంజ్ కు చేరి, మరింతగా సరికొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న సినిమా ప్రపంచంలో ఎప్పటికప్పుడు నూతన మార్పులు వస్తూనే ఉన్నాయి. ఇక నాటి చిత్తూరు నాగయ్య, కాంచనమాల, కన్నాంబ వంటి వారి దగ్గరి నుండి నేటి నాగ శౌర్య, హరితేజ, రష్మిక వంటి నూతన నటుల వరకు టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎందరో రావడం జరిగింది. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే మరికొందరు మాత్రం పెద్దగా సక్సెస్ ని అందుకోలేక పోయారు. ఇకపోతే నేటి తెలుగు సినిమా స్థాయి అయితే ఊహించనంత గొప్పగా ముందుకు సాగుతోంది అని చెప్పాలి. అయితే పలు ఇతర దేశాల నటులు సైతం మన టాలీవుడ్ వైపు చూడడానికి ముఖ్య కారణం ఇటీవల టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరక్కించిన బాహుబలి రెండు భాగాలు అని చెప్పాలి. 

 

అయితే ఆ సినిమాలు ఎంతో గొప్ప విజయాలు అందుకున్న తరువాత ఆ రేంజ్ ని అందుకోవాలని ఇప్పటికే కొన్ని సినిమాలు రావడం, అలానే మరికొన్ని షూటింగ్ దశలో ఉండడం జరిగింది. అయితే సినిమాల రేంజ్, సాంకేతికత, ఖర్చుల వంటివి ఎంతో గొప్పగా పెరిగినప్పటికీ కథల విషయమై మాత్రం చాలావరకు మార్పు రావడం లేదని కొందరు సినీ విశ్లేషకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తెలుగులు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని చిన్న సినిమాలు ఒకింత వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కి ప్రేక్షకుల మెప్పుతో విజయాలు అందుకుంటున్నాయని, అయితే ఎంతో భారీగా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న సినిమాల విషయమై మాత్రం ఆయా దర్శకనిర్మాతలు మాత్రం కథ, కథనాలపై పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదని, 

 

అందుకే మెజారిటీగా అటువంటి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయని అంటున్నారు. ఇక మొన్నటి క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని విజయాలు అందుకున్నప్పటికి కూడా ఆ సినిమాల్లో గొప్పగా చెప్పుకునే అంశాలు, కథ వంటివి లేవని కొందరు ప్రేక్షకులు కూడా అంటున్నారు. సో, దీనిని బట్టి సినిమాల ఖర్చుల విషయమై ఎంతో గొప్పగా డబ్బు ఖర్చుపెట్టడం చేస్తున్న దర్శకనిర్మాతలు, రొటీన్, మూస కథలతో ఆ సినిమాలను చివరికి దిబ్బలో కలిపే విధంగా తీస్తున్నారనేది దాని సారాంశం. కావున ఇకనైనా దర్శనిర్మాతలు, సినిమాకు ఎంతో కీలకమైన కథ, కథనాల విషయమై ఒకింత సరికొత్త ఆలోచనలు చేసి సినిమాలు తీస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: