సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో సంక్రాంతికి వచ్చిన సూపర్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు. పొంగల్ వార్ లో బ్లాక్ బస్టర్ బొమ్మగా నిలిచిన ఈ సినిమా రిలీజై 13 రోజులు అవుతున్నా మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుసగా మూడు సూపర్ హిట్ మూవీస్ తో సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనీల్ ఈ సినిమాను తన మార్క్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించాడు.

 

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావుతో డైరక్టర్ అనీల్ రావిపుడి స్పెషల్ చిట్ చాట్ జరిపారు. రాఘవేంద్ర రావు మాటల్లో సరిలేరు సూపర్ర్ బ్లాక్ బస్టర్ అనేశారు. ఇక సినిమాను అనీల్ తీసిన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. తన గురు సమానులైన రాఘవేంద్ర రావు తన సక్సెస్ ఫుల్ సినిమా గురించి స్పెషల్ డిస్కషన్స్ లో పాల్గొనడటం పట్ల అనీల్ రావిపుడి తన సంతోషాన్ని పంచుకున్నారు.

 

మహేష్ అద్భుతమైన నటన, రష్మిక క్యూట్ పర్ఫార్మెన్స్, విజయశాంతి వర్సెటైల్ ప్రతిభ, ప్రకాశ్ రాజ్ విలనిజం, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, అనీల్ సుంకర, దిల్ రాజుల ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్ని సరిలేరు సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. మహేష్ 26వ సినిమాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఆయన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ మరోసారి వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుందట. ప్రస్తుతం హాలీడేస్ లో ఉన్న మహేష్ హైదరాబాద్ వచ్చాక వెంటనే ఆ సినిమా మొదలు పెడతాడని తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: