సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన రెండు చిత్రాలు అన్ని విష‌యాల్లో తెగ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌టి మ‌హేష్ స‌రిలేరు చిత్రమ‌యితే, రెండోది  అల్లుఅర్జున్ న‌టించిన అల‌వైకుంఠ‌పురంలో ఇక ఈ రెండు చిత్రాలు ప్ర‌తి విష‌యంలోనూ పోటీప‌డుతూనే వ‌చ్చాయి. దిల్‌రాజు అలకి ముందు బ‌న్నీతో క‌లిసి ఒక `ఐకాన్‌` మూవీని ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంవ వ‌హిస్తార‌ని చెప్ప‌గా. క‌థ‌విన్న అల్లుఅర్జున్ సినిమాని త‌ప్ప‌కుండా చేస్తాన‌ని దిల్‌రాజుకి మాట‌కూడా ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే... అస‌లు మెలికంతా ఇక్క‌డే ఉంది. ఏంటా మెలికా అంటే అల్లుఅర్జున్ తాను ఒప్పుకున్న సినిమా చేయాలంటే గీతాఆర్ట్స్‌ని భాగాస్వామిగా పెట్టుకోవాలంటే చెప్పారు. 

 

కానీ దిల్‌రాజు ఎందుకోగాని మొద‌టి నుంచి కూడా మ‌ల్టీ ప్రొడ్యూస‌ర్స్ సినిమా పై పెద్ద‌గా ఆశ‌క్తిని చూపించ‌రు. అందులో మ‌హ‌ర్షి సినిమా ఆయ‌న‌కు అలాంటి చేదు అనుభ‌వాన్నే ఇచ్చింది. అందుకే మ‌హేష్ స‌రిలేరుకి కూడా దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌లేదు. అల రిలీజ్ టైంలో దిల్‌రాజు ఎక్కువ శాతం మ‌హేష్ త‌ర‌పున ఉండ‌డం. అతని సినిమాకి ఎక్కువ కలక్షన్లు చూపించడం లాంటివి అల్లు అర్జున్‌కి అసలు నచ్చలేదు. అందుకే దిల్‌ రాజుని తన సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కి కూడా ఆహ్వానించలేదని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

 

దీంతో అల మూవీకి ఎక్కువ లాభాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న మూవీగా భావించ‌లేదు.  సరిలేరు నీకెవ్వరు సక్సెస్‌ మీట్‌లో కూడా అల వైకుంఠపురములో వేరే సినిమా అన్నట్టు, సరిలేరు తన సినిమా అన్నట్టు దిల్‌ రాజు వైఖ‌రి ఉంది. దీంతో అల్లు అర్జున్ కాస్త ఫీల‌య్యారు. సినీ పరిశ్రమలో ఎక్కువ రోజులు శత్రుత్వం ఉండదు కానీ.. ప్రస్తుతానికి దిల్‌ రాజుకి, అల్లు అర్జున్‌కి అసలు పడటం లేదని సినీ వర్గాల నుంచి వార్త‌లు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైన‌ప్ప‌టికీ ఎప్పుడూ ఒకేసారి ఇద్ద‌రు ముగ్గురు స్టార్స్ సినిమాలు ఒకేసారి విడుద‌ల‌యి పోటీప‌డ‌టం అనేది కామ‌న్ కానీ ఎందుకోగాని ఈ సారి మాత్రం ఇది కాస్త ర‌చ్చ‌గానే మారింది. అది వీరిద్ద‌రికి ఉన్న ఇమేజ్ అలాంటిద‌ని కొంద‌రు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: