మాస్ రాజా కి టైం అసలు బాగోనట్టుంది. ఏం చేసినా బెడిసి కొడుతుంది. ఒక్క రా ది గ్రేట్ తప్ప మళ్ళీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తర్వాత వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా డిస్కో రాజా. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటించారు. సైన్స్ ఫిక్షన్ బ్యాగ్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. రవితేజ ఇప్పటివరకు ఇలాంటి జోనర్ లో సినిమా చేయలేదు కాబట్టి గ్యారెంటీగా సినిమా హిట్ అనుకున్నారు. కానీ బాగా తెడా కొట్టింది.

 

ఇక దర్శకుడు విఆనంద్ ఎంచుకున్న సైన్స్ ఫిక్షన్ స్టోరీ వరకు బాగున్నప్పటికి కథ కథనంలో లోపం మాత్రం సినిమా ఫ్లాప్ అవడానికి కారణమయింది. మాదిరిగానే మిగతా కథ, స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగడంతో సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికి రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్ ని అట్రాక్ట్ చేయడం కోసం రెగ్యులర్ ఫార్మాట్ లో మార్చడంతో ఆడియన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. 

 

ఇక సినిమాలో మొత్తంగా చూసుకుంటే రవితేజ పర్ఫార్మెన్స్ తప్ప చెప్పడానికి, చెప్పుకోవడానికి కొత్త విషయాలేమి లేవని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ముగ్గురు హీరోయిన్స్ గ్లామర్ గా ఉన్నప్పటికి ఆ గ్లామర్ కథకి పనికిరాదని అంటున్నారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలు సక్సస్ అవడంతో పాటు వి.ఐ.ఆనంద్ చెప్పిన సైఫై కాన్సెప్ట్ నచ్చి ఒకే చేస్తే అది బెడిసికొట్టిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దర్శకుడు ఏదో చేయాలనుకొని ఏదో చేశాడని అంటున్నారు.

 

ఇక్కడ బాగా మైనస్ గా మారింది హీరోయిన్స్. అసలు ఈ కథలో ముగ్గురు హీరోయిన్స్ కి స్పేస్ ఉందా అంటే నో అనే సమాధానమే వస్తోంది. కథ కి సంబంధం లేకుండా ముగ్గురు హీరోయిన్స్ ని ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ముగ్గురికి ఏ ఒక్కరికి కథలో ప్రాముఖ్యత లేదు. ఏదో వచ్చామా కనిపించామా అక్కడికే అయిపోయింది. కథ వీక్ కాబట్టి ముగ్గురిలో ఉన్న గ్లామర్ ని చూపించి మ్యాజిక్ చేద్దామనుకున్నారేమో గాని అదీ వర్కౌట్ అవలేదు. సినిమాకి వాళ్ళు మైనస్సే. ముగ్గురు హీరోయిన్స్ ల స్కిన్ షో ఏమాత్రం సినిమాని కాపాడలేకపోయాయట.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: