అక్కినేని హీరోల్లో అన్ లక్కీ హీరో అంటే అఖిల్ అని చెప్పక తప్పదు. అక్కినేని నట వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చినప్పటికి హీరోగా నిలదొక్కుకునేందుకు ఇంకా కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఏ ఒక్క సినిమాతోను హిట్ అందుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ డైరెక్షన్ లో యంగ్ హీరో నితిన్ నిర్మించిన మొదటి సినిమానే డిజాస్టర్‌ కావటంతో ఆ తరువాత జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇంతవరకు ఒక్క సక్సెస్‌ కూడా దక్కించుకోలేకపోయాడు. ఇక అఖిల్‌ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ లో ఈ సినిమా  నిర్మాణం అవుతోంది.

 

ఇక ఈ సినిమా తరువాత వరుగా మెగా హీరోలతో సూపర్‌ హిట్‌లు అందుకుంటున్న హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయబోతున్నాడన్న వార్త కొద్ది రోజులుగా టాలీవుడ్ మీడియా తో పాటు సోషల్ మీడియాలోను హల్‌చల్‌ చేస్తోంది. రీసెంట్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమాతో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న హరీష్, నెక్ట్స్ సినిమా కోసం ప్లాన్స్ వేసుకుంటున్నాడట.

 

అయితే అఖిల్‌, హరీష్‌ల కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై హరీష్‌ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో ఉన్న హరీష్‌ శంకర్‌ హీరో ఎవరన్న విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాలేదట. కథ పూర్తి స్థాయిలో రెడీ అయిన తరువాత కథకు తగ్గ హీరోతో సినిమా అనౌన్స్ చేస్తాడని చెప్పినట్లు సమాచారం. ఇక అఖిల్ కూడా బొమ్మరిల్లు భాస్కర్‌ సినిమా తరువాత తమిళ దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని... కథ పక్కాగా నాగ్ ఫ్యామిలీకి నచ్చితే అఖిల్ నెక్ట్స్ సినిమా ఇదే కావచ్చని అన్నపూర్ణ కాంపౌండ్ లో వినిపిస్తుందట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: