‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ కు ఆ మూవీలోని పాటలు అదేవిధంగా త్రివిక్రమ్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ సహకరించాయని విమర్శకులు భావించారు. అయితే భాగ్యనరంలోని అనేకమంది ప్రముఖులు మాత్రం త్రివిక్రమ్ వాస్తు పండితుల సలహాలతో తన ఇంటిలో చేసుకున్న భారీ మార్పులు వల్ల అద్భుత విజయం త్రివిక్రమ్ కు వచ్చింది అని భావిస్తూ తమ ఇల్లును ఒకసారి చూసి సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతూ అనేకమంది ప్రముఖులు ప్రస్తుతం త్రివిక్రమ్ కు వరసపెట్టి ఫోన్స్ చేస్తున్నట్లు టాక్.

ఇక వివరాలలోకి వెళితే ‘అజ్ఞాతవాసి’ విడుదలకు ముందు త్రివిక్రమ్ భాగ్యనగరంలో ఒక విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటిలోకి వెళ్ళిన కొద్ది రోజులకే ‘అజ్ఞాతవాసి’ విడుదల కావడడం ఆ మూవీ భారీ ఫ్లాప్ గా మారడం జరగడంతో ఇది అంతా ఆ ఇంటిలోని వాస్తు లోపం వల్ల జరిగిందని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డాడట. 

దీనితో కొంతమంది వాస్తు పండితుల సలహాతో త్రివిక్రమ్ తన కొత్త ఇంటిలోని కొంత భాగం కూల్చి వేసి మళ్ళీ వాస్తు ప్రకారం ప్లాన్డ్ గా కట్టుకున్నాడట. అలా కట్టుకున్న తరువాత త్రివిక్రమ్ తీసిన ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు వరస విజయాలు సాధించడంతో ఇది అంతా త్రివిక్రమ్ ఇంటిలోని వాస్తు బలం అని భాగ్యనగరంలోని ప్రముఖులు నమ్ముతున్నట్లు టాక్.

దీనితో అనేకమంది ప్రముఖులు త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ఒకసారి తమ ఇంటికి వచ్చి తమ ఇంటిలోని వాస్తు లోపాలను చూసి మార్పులకు సలహాలు ఇవ్వవలసిందిగా అనేకమంది కోరుతున్నట్లు టాక్. ఈ లిస్టులో అనేక మంది రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలు ప్రముఖ నిర్మాతలు ఉండటంతో స్వతహాగా మొహమాటం ఎక్కువగా ఉండే త్రివిక్రమ్ ఈ అనుకోని అభ్యర్ధనలకు షాక్ అయి ప్రస్తుతం తిప్పలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘అల’ సూపర్ సక్సస్ తరువాత అల్లు అర్జున్ ఒక భారీ వైకుంఠపురం కట్టుకోబోతున్న పరిస్థితులలో బన్నీ కొత్త ఇంటికి కూడ వాస్తు పండితుడు అయినా ఆశ్చర్యం లేదు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: