సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సినిమా యూనిట్ ఒకచోట ఈవెంట్ జరిగి ఆ సినిమా హిట్ అయితే అదే క్రమంలో కొన్ని సినిమాల ఈవెంట్ లు నిర్వహిస్తారు. ఈమధ్య కాలంలో అలాంటి ఓ పాజిటివ్ వైబ్ కలిగి సూపర్ సెంటిమెంట్ గా మారుతున్న ప్రదేశం ఖమ్మం. అవును.. ఇన్నాళ్లు ఖమ్మంలో సినిమా ఈవెంట్ లు పెద్దగా జరిగేవి కావు కాని ఇప్పుడు తరచుగా అక్కడ సినిమా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఖమ్మంలో ఈవెంట్ లు బాగా నిర్వహిస్తున్నారు.

 

సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో తెరకెక్కిన చిత్రలహరి సినిమా ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ఆ సినిమా హిట్ అయ్యింది. ఆ తర్వాత వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన వెంకీమామ సినిమా ఈవెంట్ కూడా ఖమ్మంలో నిర్వహించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఖమ్మంలో ఈవెంట్ జరిపితే ఆ సినిమా పక్కా హిట్టు అనే సెంటిమెంట్ ఏర్పడింది. లేటెస్ట్ గా యువ హీరో నాగ శౌర్య నటిస్తున్న అశ్వద్ధామ సినిమా ఈవెంట్ కూడా శనివారం ఖమ్మం సీక్వల్ రిసార్ట్స్ లో జరుగుతుంది.

 

చిత్రయూనిట్ సమక్షంలో జరిగే ఈ ఈవెంట్ ఖమ్మంలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఖమ్మంలో ఈవెంట్ అనగానే సినిమా పక్కా హిట్టు అనే పాజిటివ్ వైబ్ ఏర్పడుతుంది. రమణ తేజ డైరక్షన్ లో తెరకెక్కిన అశ్వద్ధామ సినిమాకు కథ హీరో నాగ శౌర్య అందించడం విశేషం. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. నాగ శౌర్య సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన్ ఈ సినిమా 31న రిలీజ్ అవుతుంది. ఖమ్మంలో ఇదివరకు బాలకృష్ణ పైసా వసూల్ ఈవెంట్ జరిగింది అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఈమధ్య ఖమ్మంలో జరిగిన సినిమా ఈవెంట్ కు సక్సెస్ అవడమే కాకుండా సినిమాకు సూపర్ హిట్ సాధించాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: