ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇప్పటికే 75శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసింది.  మిగతా షూటింగ్ కొన్ని రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు యూనిట్ రెడీ అవుతున్నది.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో షూట్ చేస్తున్నారు.  ఈ షూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటుగా భగత్ సింగ్ పాత్ర చేస్తున్న అజయ్ దేవగణ్ కూడా పాల్గొన్నారు.  ఈ సినిమాకు సంబంధించి ఫొటోలుగాని, సినిమా టైటిల్ కానీ, సినిమాకు సంబంధించిన ఏ విషయాలు కూడా బయటకు రావడం లేదు.  


దీంతో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  కనీసం ఒక్క విషయం కూడా బయటకు కూడా తీసుకురాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.  ఇదిలా ఉంటె, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.  సోషల్ మీడియా వచ్చిన విషయాలను బట్టి చూస్తే,  ఇందులో ఎన్టీఆర్ పులితో పోరాటం చేసే సీన్ ఉందట.  చాలా సాహసోపేతమైన ఈ సీన్ ను అద్భుతంగా షూట్ చేశారని తెలుస్తోంది.

 
దీనికి సంబంధించిన సీన్ ఒకటి బయటకు వచ్చింది.  సోషల్ మీడియాలో లీకైన వెంటనే ఆ సీన్ ను కాపీరైట్స్ ఇష్యూతో తొలగించారు.  ఎన్టీఆర్ పోరాటం అద్భుతంగా ఉంటుందని, సినిమాకు ఈ సీన్ మరో హైలైట్ అవుతుందని అంటున్నారు.  దాదాపుగా 400 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాను షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇకపోతే, ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  తెలుగుతో పాటు ఇండియాలోని అన్ని భాషల్లో సినిమా రిలీజ్ కాబోతున్నది.  


అదే విధంగా ఈ సినిమా బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు.  రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ నటి అలియా నటిస్తుంటే, ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా నటిస్తోంది.  ఈ సినిమా కోసం దానయ్య లెక్కకు మించిన బడ్జెట్ ను పెడుతున్నారని సమాచారం.  కాగా, ఈ మూవీ ఈ ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా లుక్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: