పవన్ కళ్యాణ్ మనసు మార్చి ‘పింక్’ రీమేక్ లో నటించే విధంగా ఒప్పించిన అదృశ్య శక్తి త్రివిక్రమ్ అన్న విషయం పై అనేకసార్లు వార్తలు వచ్చినా ఆ వార్తలను ఎప్పటికప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖండిస్తూ వచ్చాడు. అయినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమాకు ఓకె చెప్పడంలో త్రివిక్రమ్ హస్తం ఉంది అంటూ అనుమానంతోనే ఉన్నారు. 

ఇలాంటి పరిస్థితులలో పవన్ అభిమానుల అనుమానాలను నిజం చేస్తూ అత్యుత్సాహంతో థమన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ ‘అల వైకుంఠపురములో’ రీ రికార్డింగ్ చేస్తున్న సమయంలో త్రివిక్రమ్ తన వద్దకు వచ్చి తనను పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ కు సంగీత దర్శకుడుగా ఎంపిక చేసారు అన్న వార్త చెప్పి తనకు త్రివిక్రమ్ షాక్ ఇచ్చిన విషయం బయట పెట్టాడు. 

ఇప్పుడు ఇలా థమన్ కామెంట్ చేయడంతో ‘పింక్’ రీమేక్ వెనుక కర్త కర్మ క్రియ ఇలా అన్ని బాధ్యతలు త్రివిక్రమ్ నిర్వర్తిస్తున్నాడు అన్న విషయం మరొకసారి స్పష్టమైంది అని పవన్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే పవన్ కు పనికిరాని ‘అజ్ఞాతవాసి’ ని తీసి అల్లు అర్జున్ కు శ్రద్ధ పెట్టి ‘అల వైకుంఠపురములో’ తీసినందుకు మండిపోతున్న పవన్ వీరాభిమానులు ఇప్పుడు ‘పింక్’ విషయంలో కూడ త్రివిక్రమ్ వేలుపెట్టి కేలుకుతున్నాడు అన్న విషయం తెలుసుకుని అసహనానికి లోనవుతున్నారు.

వాస్తవానికి పవన్ ‘పింక్’ రీమేక్ కు త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో సలహాలు అందిస్తున్నాడు అని వస్తున్న వార్తలను ఖండిస్తున్నా ఎక్కడో అక్కడ త్రివిక్రమ్ తన ప్రియ మిత్రుడు పవన్ కోసం సలహాలు ఇచ్చే ఆస్కారం స్పష్టంగా ఉంది. అయితే యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ త్రివిక్రమ్ సలహాల ఒత్తిడిని పవన్ మూడ్ ను తట్టుకుని సరిగ్గా తీయలేకపోతే పవన్ కు ఇక పూర్తిగా సినిమాల పై విరక్తి పెరగడం ఖాయం..   

మరింత సమాచారం తెలుసుకోండి: