తెలుగులో ఈ మద్య ప్రతిష్టాత్మకమైన సినిమాలు వరుసగా వస్తున్నాయి. బడ్జెట్ ఎంతైనా ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చుపెట్టి అగ్ర హీరోల సినిమాలు తెరకెక్కిస్తున్నారు.ఈ నేపథ్యంలో బ్రిటీష్ వారిని గజ గజ వణికించిన తొలి తెలుగు పోరాట యోధుడు..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, మళియాళ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నారు చిత్ర యూనిట్. కానీ ఆ ఆశలన్నీ తలకిందులయ్యాయి.. మూవీని ప్రేక్షకులు ఆదరించలేక పోయారు.  

 

స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో వచ్చిన మూవీ అన్ని ఎలిమెంట్స్ బాగున్నా.. జనాలకు మాత్రం సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు.  దాంతో ఈ మూవీ అన్ని భాషల్లో మిశ్రమ స్పందన..డిజాస్టర్ టాక్ వచ్చింది.  అయితే ఈ మద్య పెద్ద సినిమాలు థియేటర్లో పడ్డ కొద్ది రోజులకే బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సైరా చిత్ర శాటిలైట్ హక్కులని ప్రముఖ ఛానల్ జెమిని సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా సైరా చిత్ర ప్రీమియర్ ని బుల్లితెరపై ప్రదర్శించారు. అయితే ఇక్కడ కూడా భారీ నిరాశనే ఎదురైంది సైరా మూవీకి. సాధారణంగా వెండి తెరపై సత్తా చాటకున్నా కొన్ని సినిమాలు బుల్లితెరపై సత్తా కొనసాగిస్తాయి. 


సైరా మూవీకి కేవలం 11.8 టీఆర్పీ రేటింగ్ నమోదైంది. జెమిని సంస్థ తెలుగు, తమిళం, మలయాళీ భాషలకి గాను సైరా శాటిలైట్ హక్కులని రూ25 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అయితే దీనికి కారణం సైరా డిజిటల్ హక్కులు అన్ని భాషల్లో రూ 50 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. బుల్లితెరపై సైరా మూవీకి ఆశించిన టిఆర్పి రేటింగ్ నమోదు కాకపోవడానికి కారణం అమెజాన్ ప్రైమ్ అని అంటున్నారు. బుల్లితెరపై కంటే ముందుగానే సైరా చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. అమేజాన్ లో హెచ్ డీ క్వాలిటీతో ఉంటుంది కనుక దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: