‘బిగ్ బస్ 3’ సీజన్ విన్నర్ గా ఎంపిక అయిన రాహుల్ ఆ తరువాత చాల తెలివిగా అడుగులు వేస్తూ ఎదిగి పోతున్న వైనాన్ని చూసి చాలామంది బుల్లితెర సెలెబ్రెటీలు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్య పడుతున్నారు. ప్రస్తుతం రాహుల్ మంచి బిజీ సింగర్ గా మారడమే కాకుండా ఈ నెలలో జరిగిన అనేక న్యూఇయర్ పార్టీలకు రాహుల్ అతిధిగా రావడానికి అక్కడ స్టేజ్ షోలో పాడడానికి అత్యంత భారీ మొత్తాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇదిచాలదు అన్నట్లుగా కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ప్రారంభింపబడుతున్న అనేక వ్యాపార సంస్థలకు ముఖ్యంగా సెల్ షోరూమ్స్ ఓపెనింగ్ కు రాహుల్ ను అతిధిగా పిలుస్తున్నారు. ఈ విషయమై కూడ రాహుల్ కు భారీ మొత్తాలు ముట్ట చెపుతున్నట్లు టాక్. 

ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ఇతడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నటసామ్రాట్’ మూవీలో కీలక పాత్రకు ఎంపిక అయిన పరిస్థితులలో ఆ మూవీ హిట్ అయితే ఇక రాహుల్ కెరియర్ కు ఇక ఆకాశమే హద్దు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇదిచాలదు అన్నట్లుగా రాహుల్ భాగ్యనగరంలో త్వరలో ప్రారంభం కాబోతున్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ను ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారడమే కాకుండా ఆ కంపెనీలో షేర్ కూడ రాహుల్ కు ఇవ్వబడింది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే సొంత ఇల్లు ఖరీదైన కారు కొనుక్కుని జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న రాహుల్ కెరియర్ ను చూస్తున్నవారు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి శివబాలాజీ కౌశల్ లు ‘బిగ్ బాస్’ సీజన్ 1-2 విజేతలు అయినా వీరిద్దరూ రాహుల్ స్థాయిలో తమకు వచ్చిన క్రేజ్ ను తెలివిగా డబ్బుగా మార్చుకోలేక పోయారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. శివ బాలాజీ సినిమాలు తీసి నష్టపోతే కౌశల్ అనవసరపు వివాదాలలో తల దూర్చి తన ఇమేజ్ పోగొట్టుకున్నాడు. అయితే రాహుల్ మాత్రం చాల తెలివిగా వ్యవహరిస్తున్నాడు అంటూ అతడి తెలివి తేటలు చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: