ఈవారాంతంతో సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తి అయిపోతుంది. నిన్న విడుదల అయిన రవితేజ ‘డిస్కోరాజా’ కు యావరేజ్ టాక్ రావడంతో పరిస్థితులు అన్ని యంగ్ హీరో నాగశౌర్య కు అనుకూలంగా మారుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో వచ్చే వారం విడుదల కాబోతున్న'అశ్వథ్థామ'  సినిమాను నాగశౌర్య చాల పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడమే కాకుండా ఈ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి సుమారు 11 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ మూవీకి ఓవర్సీస్ మార్కట్ లో మాత్రం ఎదురీత ఎదురైనట్లు టాక్. దీనికి కారణం ఈ సినిమాను కొనడానికి చాలామంది ఓవర్సీస్ బయ్యర్లు చేసిన వింత కామెంట్స్ అని అంటున్నారు. నాగశౌర్య నాగ చైతన్యలు లవ్ స్టోరీ సినిమాలు చేస్తే జనం చూస్తారు కాని మాస్ యాక్షన్ మూవీ చేస్తే ఎవరు చూస్తారు అంటూ కామెంట్స్ చేసినట్లు టాక్. 

అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా ఈ మూవీ ద్వారా మాస్ హీరోగా మారాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. తన సొంత బ్యానర్ లో నిర్మాణం జరిగిన ఈ మూవీకి కథను కూడ తానే సమకూర్చాను అని చెప్పి అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఈమధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో సినిమా ఫంక్షన్స్ జరిగితే బాగా జనం వస్తున్న పరిస్థితులలో అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ ఈరోజు ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఖమ్మంలో జనం మధ్య జరుపుకుంటూ తనకు కూడ జనం బాగా వస్తారు అని చెప్పడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈ యంగ్ హీరో నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అయిన పరిస్థితులలో ‘ఓ బేబి’ మాత్రం ఈ హీరోకు మళ్ళీ ఆశలను రేపింది. ఇలాంటి పరిస్థితులలో ‘అశ్వద్దామ’ నాగ శౌర్య కెరియర్ కు ఎలాంటి టర్నింగ్ ఇస్తుందో తెలియాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: