చంద‌మామ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అగ్ర‌హీరోలంద‌రితో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. ద‌శాబ్ద కాలంగా త‌న అందం అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది ఈ భామ‌. స్టార్ హీరోయిన్‌గా మంచి హిట్‌లు కొడుతున్న ఈ భామ తెలుగులోనే కాక ఇత‌ర భాష‌ల్లోనూ అదే పేరును సంపాదించుకుంది. మొద‌ట్లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌మిచ్చిన‌ప్ప‌టికీ ఈ మ‌ధ్య న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌నే ఎంపిక చేసుకుంటుంది. 

 

ఇక‌ హిందీలో 2013లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో  తెర‌కెక్కిన  క్విన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్ప‌ట్లో ఆ సినిమాలో కంగనా పాత్ర‌కు మంచి మార్కులు పడ్డాయి. దానికితోడు మంచి కలెక్షన్స్‌ను కూడా రాబట్టి బాక్సాఫీస్ వ‌ద్ద‌ అదరగొట్టింది. కాగా ఆ సినిమాను తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేశారు. తెలుగులో తమన్నా చేయగా.. తమిళంలో మాత్రం కాజల్ 'పారిస్ పారిస్' అంటూ ప్రధాన పాత్రలో పోషించింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఆ టీజర్‌లో కొంత గ్లామర్ డోస్‌ను పెంచి చాలా బోల్డ్ పాత్ర‌ని కాజల్ నటించిందని టాక్. పాత్రకి అవసరమంటూ కాజల్ కూడా కన్విన్స్ అయి ఆ సన్నివేశాలలో నటించాల్సిన అవ‌స‌రం లేద‌ట‌. ఆ మధ్య విడుదలైన ఆ చిత్రం టీజర్ వైరల్ అయిన విషయం తెలిసేందే.

 

కాజ‌ల్ ఈ మ‌ధ్య ఓ బోల్డ్ పాత్ర‌లో త‌న చెస్ట్ని ఎక్స్‌పోజ్ చేస్తూ మ‌రో దాన్ని ప‌ట్టుకున్న దృశ్యాన్ని అన్ని సోష‌ల్ మీడియాల్లో హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. తీరా కాజ‌ల్ బాదేమిటంటే ఇంత క‌ష్ట‌ప‌డి సినిమా మొత్తం పూర్తి చేస్తే తీరా అది విడుద‌ల కూడా అవుతుందో లేదో అన్న క‌ష్టాల్లో కాజ‌ల్ కూరుకుపోయింది. దాదాపుగా చాలా రోజుల క్రిత‌మే ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్త‌యింది. కానీ ఎందుకో విడుద‌ల‌కు మాత్రం నోచుకోలేదు. కాజ‌ల్ క‌ష్టాన్ని గుర్తించిన అభిమానులు సెన్సార్ స‌భ్యులు అభ్యంత‌రం చెబుతారేమో అని తెగ ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌స్తుతం కాజ‌ల్ త‌న నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌తో తెగ బిజీగా ఉంది. భార‌తీయుడు 2 చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో కాజ‌ల్ ఓ వృద్ధురాలి పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: