బాహుబలి ద్వారా తెలుగు సినిమా స్థాయి ఎంతో పెరిగింది. అప్పటి వరకూ ఎవరూ ధైర్యం చేయని దాన్ని రాజమౌళి చేసి చూపించడంతో అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు. అయితే బాహుబలి లాంటి ఇమేజ్ ఇంతవరకు ఎవరూ సంపాదించలేదు. బాహుబలి తరహా సినిమా నిర్మించాలనుకున్నా కూడా ఇప్పటి వరకైతే ఎవరికీ సాధ్యం కాలేదు. అయితే బాహుబలి ద్వారా ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు.

 

 

ప్రస్తుతం దక్షిణాది హీరోలందరూ పాన్ ఇండియా హీరోలవుదామని చూస్తున్నారు. కేజీఎఫ్ సినిమా కూడా హిట్ అవడం దీనికి మరింత ఊతమిచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాన్ హిందీ పింక్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చేస్తుండగానే దర్శకుడు క్రిష్ తో మరో సినిమాని పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమా ఈ నెల ౨౭ వ తేదీ నుండి లాంచనంగా ప్రారంభం కానుందని సమాచారం.

 

 

 

అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే యోచనలో ఉన్నారట.  క్రిష్‌కు ఆల్రెడీ బాలీవుడ్లో సినిమాలు చేసిన అనుభవం ఉంది. పవన్‌ సినిమాలు కూడా హిందీలో అనువాదం అయి అక్కడ అతడికి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. క్రిష్ ఎంచుకున్న కథకు పాన్ ఇండియా అప్పీల్ ఉందని.. ఈ పీరియడ్ మూవీని సరిగ్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే అన్ని భాషల్లోనూ విజయాన్నందుకునే అవకాశముందని భావిస్తున్నారట.

 

 

పవన్ క్రిష్ ల సినిమాకి ఎ ఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి మొదటి సారి చేస్తున్న పవన్ కళ్యాన్ పాన్ ఇండియా చిత్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రగ్యా జైశ్వాల్ నటించనుందని సమాచారం. తెలుగు పింక్ రీమేక్  తో పాటు క్రిష్ తో చేస్తున్న సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకోనున్నయట.

మరింత సమాచారం తెలుసుకోండి: