ఓ మీడియం సినిమాలో నటించేందుకు భారీ స్థాయిలో పూజా హెగ్డే డిమాండ్ చేయడంతో షాకయ్యారట. దాంతో.. పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. పూజా హెగ్డే.. ఇప్పుడు వరుసగా అగ్ర కథానాయకులతో విజయాల దారిలో ఉంది. ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’ తర్వాత… తాజాగా ‘అల.. వైకుంఠపురంలో’ ఈమెకు మరో హిట్‌ అందించింది. ఇదే ఊపులో ప్రభాస్‌తో నటిస్తోంది. అయితే.. వరుసగా రొటీన్ సినిమాలలో చేస్తున్న పూజాకి.. అడివి శేష్‌ ‘మేజర్’ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించే ఆఫర్ వచ్చిందట.


ముంబై ఎటాక్స్‌లో అశువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో ‘మేజర్’ చిత్రం చేస్తున్నారు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సోనీ పిక్చ‌ర్స్ తో కలిసి మహేశ్‌బాబు నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమాలోని కీలకమైన రోల్‌కి పూజా హెగ్డేని సంప్రదించిందట నిర్మాతల్లో ఒకరైన నమ్రత శిరోద్కర్. ఈ పాత్ర చేయడానికి ఓ.కె. చెప్పిన పూజా.. ఏకంగా రెండు కోట్లు పారితోషికంగా డిమాండ్ చేసిందట. అడివి శేష్ హీరో గా చేసే సినిమాలో నటించేందుకు.. అంత భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతో యూనిట్ షాకయ్యిందట. దాంతో.. పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంచిం చారట. కెరీర్ లో చెప్పుకోదగ్గ పాత్రలు వచ్నినప్పుడు..ఆర్టిస్ట్ లు పారితోషికం విషయంలో పట్టు విడుపుతో వుంటే మంచిదని అంటున్నారు పరిశ్రమలోనివారు . మరి..ఈ పాత్ర ఎవరిని వరిస్తుందో చూడాలి.
 

తమన్నాకి గత ఏడాది తెలుగు, తమిళంలో మంచి విజయాలే దక్కాయి. దాంతో తన రెమ్యునరేషన్‌ అమాంతంగా కోటి పెంచేసిందట .అంతకు ముందు కోటి వరకూ తీసుకునేది. ఆమె కొత్త రేటు తెలియని నిర్మాతలు ఇప్పుడు ఆమె డేట్ల కోసం వెళితే ఏకంగా రెండుకోట్లు అడుగుతోందట. కాల్‌షీట్లు ఎన్నైనా కానీ రెండు కోట్లు ఇవ్వాల్సిందే అంటోంది. ‘రెండు కోట్లకు ఒక్కరూపాయి తగ్గినా తీసుకోను’ అంటూ ఖరాఖండిగా చెప్పడంతో నిర్మాతలకు పగలే చుక్కలు కనపించినంత పనయిందట. మరీ భారీ సినిమాలు లేక పోయినా.. తమన్నా ఇంత డిమాండ్ చెయ్యడం ఏంటని విమర్శలు వినిపిస్తున్నాయి.


బీజేపీ పార్టీ స్థానిక స‌మ‌స్య‌లను ప‌క్క‌ను పెట్టి జాతీయ అంశాల‌ను ప్ర‌చారంలోకి తీసుకెళ్ల‌డం బీజేపీ పాలిట శాపంగా మారింది. దీంతో ఫ‌లితాలు తారుమారైన‌ట్లు తెలుస్తున్న‌ది. కాంగ్రెస్ చాలా స్తానాల్లో పోటాపోటీగా ఉన‌్న‌ప్ప‌టికీ కేసీఆర్ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌లకు మోజు తీర‌లేద‌ని ఫ‌లితాల‌ను బ‌ట్టి తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: