ఊహలు గుసగుసలాడే, ఛలో సినిమా తర్వాత లవర్ బాయ్ ఇమేజ్ ని సంపాదించిన నాగ శౌర్య..తన పాపులారిటీని అన్ని కోణాల్లో పెంచుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే అశ్వథ్థామ చిత్రంలో మొదటిసారిగా మాస్ పాత్రలో నటించి.. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. ఈ సినిమా జనవరి 31న విడుదలవ్వనుంది. నాగ శౌర్య తన సొంత బ్యానర్ ira క్రియేషన్స్ కింద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథని కూడా తానే అందించగా.. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.మాస్ ఇమేజ్ ను పెంచుకోవడానికి అశ్వథ్థామ చిత్రం సరైనదని నాగ శౌర్య భావిస్తున్నారు. 

 

 

మొదటిలో ఈ సినిమా అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలయ్యే రోజే ప్రేక్షకుల ముందుకి రానుందని వార్తలు వచ్చాయి. దీంతో వీళ్లిద్దరి అభిమానులంతా ఆశ్చర్యపోయారు. కానీ అదృష్టవశాత్తు.. నిశబ్దం సినిమా యొక్క రిలీజ్ డేట్ కాస్త వాయిదా పడింది. దీంతో అనుష్క నాగ శౌర్య సినిమా కి ఎంతో మేలు చేస్తుందని నాగ శౌర్య తో పాటు తన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

ఇకపోతే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ విడుదలై పాజిటివ్ టాక్ ని సంపాదించి అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రంలో నాగశౌర్యా సరసన మెహ్రీన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి చరణ్ పాకాల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా.. గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అయితే, అశ్వథ్థామ సినిమాలో హీరో నాగ శౌర్య ఆడపిల్లలను హత్య చేసే ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తుంటాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో డైలాగులు హార్ట్ టచింగ్ గా ఎమోషనల్ గా ఉన్నాయి. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మాస్ పాత్ర పోషించిన నాగ శౌర్యా తన అభిమానులు ఎంతగా ఆకట్టుకుంటారో చుడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: