సూపర్ స్టార్ మహేష్ బాబు- సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు ఇటీవల విడుదలై  బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది.  రెండు వారాల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 128.13కోట్ల షేర్ ను రాబట్టి  బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది.  ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డు లను సృష్టించి 106.76 కోట్ల షేర్ ను రాబట్టింది.  అంతేకాదు టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన 5వ చిత్రంగా  సరిలేరు రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో మరో స్థానాన్ని ఎగబాకి  4 వస్థానం లో నిలువనుంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈచిత్రం బ్రేక్ఈవెన్ కావడం అసాధ్యంగానే  కనిపిస్తుంది. 
 
 ప్రపంచ వ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు వసూళ్ల వివరాలు : 
నైజాం - 34.97 కోట్లు 
సీడెడ్ - 14.79 కోట్లు 
ఉత్తరాంద్ర - 18.2 కోట్లు 
గుంటూరు -9.3 కోట్లు 
తూర్పు గోదావరి - 10.6 కోట్లు 
పశ్చిమ గోదావరి - 6.93 కోట్లు '
కృష్ణా - 8.27 కోట్లు 
నెల్లూరు - 3.7 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14రోజులకు గాను షేర్ = 106.76కోట్లు 
రెస్ట్ అఫ్ ఇండియా - 9.65కోట్లు 
ఓవర్సీస్ -  11.72 కోట్లు 
ప్రపంచ వ్యాప్తంగా 14రోజులకు గాను షేర్ = 128.13కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: