తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయమైన నాగశౌర్య... విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో నాగశౌర్య సినిమా వస్తుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఏ కథ పడితే ఆ కథ చేయకుండా... కథాంశం బలంగా ఉండి కొత్తగా ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నాగ శౌర్య. ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో నాగశౌర్య కు మంచి గుర్తింపు ఉందని చెప్పాలి. కాగా ప్రస్తుతం నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రం అశ్వద్ధామ. ప్రస్తుతం ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో సాగే కథలో ... హీరో నాగ శౌర్య డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. 

 

 కాగా  నాగశౌర్య హీరోగా నటించిన అశ్వద్ధామ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నాగశౌర్య అంటే ఎప్పుడు వరకు ఒక లవర్ బాయ్ గానే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. తను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో ఒక లవర్ బాయ్ గా నటిస్తూ అందరిని అలరించాడు. కానీ అశ్వద్ధామ సినిమా లో మాత్రం మంచి యాక్షన్ హీరోగా కనిపిస్తాడు నాగ శౌర్య. యాక్షన్ సన్నివేశాలు కూడా అశ్వద్ధామ సినిమా లో అద్భుతంగా ఉంటాయని ఒకానొక సమయంలో నాగశౌర్య కూడా తెలిపాడు. ఇకపోతే అశ్వద్ధామ షూటింగ్ సమయంలో నాగశౌర్య కాలు విరిగి ఎన్నో రోజులు బాధ పడిన విషయం తెలిసిందే. 

 


 కాగా ఈ సినిమా కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హాజరైన నాగ శౌర్య తన కాలు విరిగిన సంఘటన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అశ్వద్ధామ సినిమా లో యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని... అందుకే కే జిఎఫ్ సినిమా కు స్టంట్ మాస్టర్ గా పనిచేసిన అన్బు - అరివు  అనే స్టంట్ మాస్టర్ ని అశ్వద్ధామ కోసం తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ సినిమాలో ఓ చేజింగ్ సీన్లు... డూప్ పెడదామని  స్టంట్ మాస్టర్లు చెప్పినప్పటికీ...డూప్ అని  ప్రేక్షకులకు తెలిస్తే కథలో  నుంచి బయటకు వస్తారని నాకు  అనిపించడంతో నేనే  స్వయంగా చేస్తానని చెప్పాను . ఈరోజు స్టంట్ కోసం రోప్ కూడా  వాడకూడదు అని  నిర్ణయించుకుని ఆ సీన్లో పరిగెడుతూ  ఐదో అంతస్తు నుంచి పడిపోయాను దాంతో కాళ్ళు విరిగి కొన్నిరోజులు బాధ పడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: