మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే తాను మళ్లీ తెరపై కనిపించేందుకు చాలా సమయం తీసుకున్న మెగాస్టార్ ఇక వరుసగా సినిమాలు మొదలు పెట్టేవారు.  ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించారు.  భారత దేశంలో బ్రిటీష్ వారిపై పోరాటం జరిపి తొలి తెలుగు వీరుడు.. రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కించారు. కాకపోతే ఈ మూవీ అనకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.  ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ స్వాతంత్ర నేపథ్యంలో ఉన్నా ప్రేక్షకులు మాత్రం రిసీవ్ చేసుకోలేక పోయారు.  రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించారు.  కాకపోతే ఈ మూవీతో ఎప్పటి నుంచి మెగాస్టార్ కల ఈ పాత్ర  పోషించి.. ఆయన కోరిక తీర్చుకున్నారు.

 

 ఈ మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు.  ఇప్పటికే మిర్చి,శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను మూవీస్ తో మంచి సక్సెస్ తో దూసుకు పోతున్నారు కొరటా శివ.  తన మూవీ మంచి హిట్ కావాలనే యోచనతో ఆయన దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ సిద్దమయ్యారు. ఇప్పటికే వీరి మూవీ సెట్స్ పైకి రావడం.. ఆ మద్య సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమా త్వరగా పూర్తి చేయాలని కొరటాలతో చిరంజీవి చెప్పడం కూడా జరిగింది.  సాధారణంగా కొరటాల శివ సినిమా షూటింగ్ కోసం కనీసం 130-140 రోజుల సమయం తీసుకుంటారు.  

 

అయితే, ఈసారి అంత ఎక్కువ సమయం తీసుకోకుండా 90 రోజుల్లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారట.  ఈ నేపథ్యంలో కోకాపేటలో వేసిన స్పెషల్ సెట్ లో చిరంజీవి షూట్ చేస్తున్నారు.  ఎక్కువగా నైట్ టైమ్ లో షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఉదయం, రాత్రి తేడా లేకుండా మెగాస్టార్సినిమా కోసం కష్టపడుతున్నారు.  ఉదయం కొంత సమయం రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే దొరుకున్నదట. ఈ మూవీ త్వరగా పూర్తి చేసుకొని సమ్మర్ లో ప్లాన్ చేయాలనే యోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: