రాయకీయాల్లోకి రాక ముందు పవన్ కళ్యాణ్ వేరు. సినిమాలలో ఆయన్ని చూసి గుడ్డలు చింపుకున్న అబిమానులు ఎంతమది ఉన్నారో లెక్కే లేదు. కార్ల టైర్లను చేతుల మీద ఎక్కించుకొని, విచిత్రమైన ఫైట్స్ చేసి..డిఫ్రెంట్ మూడ్ లో డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మెగాస్టార్ సినిమాలకి దూరం అయ్యాక ఆ తర్వాత పవర్ స్టారే అన్న ఇమేజ్ ని సంపాదిచుకున్నారు. అయితే ఈ మాట ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు. నాకు దేవుడైనా, గురువైనా అన్నయ్య తర్వాతే అని నొక్కి నొక్కి చెప్పేవారు. నేను అసలు ఏమై పోతానో అనుకున్నాను. కాని ఈ నటన, ఇంత క్రేజ్, నామీద కొన్ని కోట్ల మంది చూపించే అభిమానం ఇదంతా మా అన్నయ్య చిరంజీవి గారు పెట్టిన బిక్ష అన్నట్టుగా ఎన్నో సందర్భాలలో చెప్పారు. 

 

అయితే రాజకీయాల్లోకి వచ్చాక కొత్త పవన్ కళ్యాణ్ ని చూశాము. ఆయనలోని ఫైరింగ్ ని చూశాము. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పవన్ కళ్యాణ్ ని చూశాము. ప్రజల కోసం దేవుడి లాంటి అన్నయ్యకి ఎదురెల్లాను... తపలేదు మరి ..! అన్న పవన్ కళ్యాణ్ ని చూశాము. జన కోసం తపించే నాయకుడు పవన్ కళ్యాణ్. ఇది కాదనలేని సత్యం. కానీ అందులో ఎంతవరకు నిబద్దత ఉందో అందరు ప్రత్యక్షం గా చూశారు. అందరు ఈదారి అంటే నాది గోదారి అంటుంటారు మన జనసేనాని. నిజంగా ప్రజల శ్రేయస్సుకోరుకునే నాయకుడైతే ఒడ్డు చేరాక తెప్ప తగలెయ్యరు. కాని ఈయనని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. 

 

మొన్నటి వరకు 'టి.డి.పి. కి సలాం బాబుకి గులాం' .. అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు 'మోడీ జీ' .. అంటూ మాట కలిపారు. రోజుకో ప్రవర్తన గంటకో మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నయ్య మెగాస్టార్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. మరి మెగా ఫ్యాన్స్ ఈ కామెంట్స్ కి ఎందుకో సైలెంట్ గా ఉన్నారు అర్థం కావడం లేదు. అదే గనక అల్లు అర్జున్ అంటే మేమంతా మెగా ఫ్యాన్స్ అంటూ పనికిమాలిన వాళ్ళందరు ఇష్టమొచ్చినట్టు అరిచి... గోల పెట్టి.. ట్వీటి నానా రచ్చ చేసేవాళ్ళు. మరి ఎందుకీ డిఫ్రెన్స్. పీ.కె అయితే అలా..బన్నీ ఐతే ఇలా రియాక్ట్ అవుతారా ...చెప్పండి బ్రదర్ ..ఇప్పుడు చెప్పండి!

మరింత సమాచారం తెలుసుకోండి: