తమిళ స్టార్ హీరో విజయ్, ఖైదీ ఫేమ్  లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మాస్టర్. గత కొద్దీ నెలల నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం ఫిబ్రవరి లో పూర్తి కానుంది. ప్రస్తుతం ఈ  సినిమా షూటింగ్ చెన్నై లో జరుగుతుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.వీరితో పాటు ఆండ్రియా  జెర్మియా , శంతన్ భాగ్యరాజ్,అర్జున్ దాస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 
 
ఇక ఈ చిత్రం నుండి ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్ , సెకండ్ లుక్ లకు సూపర్ రెస్పాన్స్ రాగ మూడో లుక్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం 5గంటలకు విడుదలకానుంది.యంగ్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎక్స్ బి ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే  ఈసినిమా థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.  మొత్తం కలిపి ఈసినిమా రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా  200 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
 
 
ఇక  సర్కార్ , బిగిల్ చిత్రాలతో  తెలుగులోనూ సూపర్ హిట్లు కొట్టిన విజయ్ ఇక్కడ  కూడా మంచి మార్కెట్  ను ఏర్పరచుకున్నాడు. దాంతో మాస్టర్ పై తెలుగులోనూ మంచి అంచనాలు వున్నాయి. కాగా మాస్టర్ తెలుగు వెర్షన్ హక్కులను  యువ నిర్మాత mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు 9కోట్లకు  సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు బిగిల్ ను విజిల్ పేరుతో  తెలుగు లో విడుదలచేసిన  మహేష్  ఆ సినిమా తో మంచి లాభాలను పొందాడు. మరి ఈ మాస్టర్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: