సాధార‌ణంగా హైపర్ ఆది.. పంచ్ వేస్తె ఎవరికైనా షాక్ తగలసిందే. జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు.  జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. షోలో ఆటో పంచ్‌లు, రివర్స్ పంచ్‌లు ఓ ఎత్తైతే.. హైపర్ ఆది పంచ్‌లు మరో ఎత్తు. ఆది వేయడంలో మహా ఎక్స్ పర్ట్ అనే చెప్పవచ్చు. కానీ ఒక్కోసారి ఆ పంచులు మిస్ ఫైర్ అవుతుంటాయి. దీంతో వివాదాలు ముసురుకొస్తుంటాయి.

 

అయిన‌ప్ప‌టికీ ఈయ‌న మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డు. అందుకే ఆదిని ఏమైనా అనాలంటే ముందే రివర్స్ పంచులకు కూడా సిద్ధంగా ఉండాలి. ఈయ‌న ప్ర‌తి స్కిట్‌లోనూ ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేసుకుని పంచ్‌లు వేస్తుంటాడు. అయితే ఆ సారి మాత్రం ఈయ‌న చూపు క‌ట్ట‌ప్ప‌పై ప‌డింది. ఆది తాజాగా వ‌చ్చిన స్కిట్‌లో..  రోహిణీ ఆదికి భార్యగా, అనసూయ మరదలుగా ఫుల్ కామెడీ చేసిన ఈ స్కిట్‌లో.. ఆది వరస పంచ్‌లకు కడుపు చెక్కలు చేశాడు. ఈ నేప‌థ్యంలోనే ఏమండీ.. ఇందాక ఆటోలో ఉన్నవాడు నాకు తగిలాడు. వాడి మెడలో చైన్ చాలా బాగుంది నాకూ చెయ్యించండీ’ అంటుంది రోహిణీ.

 

దీంతో.. తగిలినోడికి రెండు తగిలించండని చెప్పకుండా వాడి మెడలో చైన్ దీనికి తగిలించమంటోంది. అందుకే పెళ్లి చేసుకోకూడదంటారు.. ఏం చేస్తాం. బాహుబలిలో అందరూ పెళ్లి చేసుకున్నారు కానీ కట్టప్ప మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఎందుకో తెలుసా? బయటా బానిసగా ఉండి, ఇంట్లోనూ బానిసగా ఉండటం ఎందుకులే అని చేసుకోలా’ అంటూ తనదైన శైలిలో కామెడీ పండించాడు. ఇలా స్కిట్ మొత్తం హైప‌ర్ ఆది అదిరిపోయే పంచ్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు. ఏదేమైనా ఆది స్కిట్ మొదలైందంటే.. పొట్ట చెక్కలు అయిపోతున్నా.. వరస పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. ఆ సారి కూడా అదే జ‌రిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: