బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్, సెక్సీ హీరోయిన్ ..అన్న టాగ్స్ సాధించడం చాలా కష్టమైన పని. అయితే వాణి కపూర్ మాత్రం ఇది చాలా ఈజీ కదా అంటూ తన యాంగిల్ లో ప్రూవ్ చేసి చూపించింది. 'శుద్ద్ దేశి రొమాన్స్' సినిమాలోనే హీరో సుశాంత్ కు ఘాటు లిప్పులాకులు ఇచ్చి బాలీవుడ్ జనాలకి పిచ్చెక్కించింది. అసలు కిస్సుల విషయంలో ఇమ్రాన్ హష్మీ తప్ప బాలీవుడ్ లో ఇంకో పేరు వినిపించలేదు. సీరియల్ కిస్సర్ అన్న పేరు అప్పటి వరకు ఏ హీరోకి లేదు. అది ఇమ్రాణష్మి సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆ పేరుని ఒకరకంగా వాణి సంపాదించుకుంది. 'బెఫిక్రే' లో రణవీర్ సింగుకు ఇచ్చిన కిస్సులు కనుక లెక్కపెడితే 'కిస్సుల కేటగిరీ' కింద వాణికి ఖచ్చితంగా ఒక అవార్డు ఇవ్వాల్సిందే. అయితే ఈ సినిమా ఫ్లాపవడంతో అన్ని కిస్సులిచ్చిన కిక్ లేకుండా పోయింది. పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే యూ ట్యూబ్ లో మాత్రం వాణీ కిస్సులని చూడని వారుండరు. ఇక ఈమధ్యే 'వార్' సినిమా సక్సస్ తో వాణి ఒక్కసారిగా బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

 

ఇంత హాటు బ్యూటీ సోషల్ మీడియాలో హీటు పెంచకపోతే ఇన్స్టాగ్రామ్ లో జనాలు ఏం కావాలి? అందుకే ట్రెండ్ ని ఫాలో అవుతూ ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ ఒక నలుపు రంగు లవ్ ఎమోజి మాత్రం పెట్టింది. అది చూసిన నెటిజెన్స్ 'ఐ లవ్ బ్లాక్' అని మీనింగా వాణీ అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ ఫోటోలో వాణీ బ్లూ జీన్స్ ధరించి.. పైనేమో బ్లాక్ కలర్ జాకెట్ ధరించింది. ఆ జాకెట్టును సాధారణంగా ధరిస్తే మనం ఇంతగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అలాగే నెటిజెన్స్ అబ్బా ...అంటూ ఆవేశంగా కామెంట్స్ పెట్టే అవసరమూ రాదు. ఆ జాకెట్ కు కరెక్ట్ గా మధ్యలో ఒక బటన్ మాత్రం పెట్టుకుంది. దీంతో డ్రెస్సుకు టన్నుల్లో హాట్ నెస్ వచ్చేసింది. ఫోజిచ్చిన స్టైల్..క్తూట్ స్మైల్ కూడా బాగా కవ్విస్తున్నాయి. 

 

ఎగసి పడే ఎద అందాలున్న ఈ ఫోటో చూసిన సాధారణ వ్యక్తులు ఎవరైనా వాణి మాయలో పడి'పోవడం' గ్యారెంటి.  ఈ ఫోటోకు అందుకే చాలా లైక్స్ వచ్చాయి. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు. "బాలీవుడ్ విష కన్య".. "లాజవాబ్".. "స్టన్నింగ్ బ్యూటీ" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక వాణి ప్రస్తుతం 'షంషేరా' అనే సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమాలో సంజయ్ దత్.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్నట్టు వాణీ మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. నేచురల్ స్టార్ నాని కి లి కిస్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: