బాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్ గా పేరుతున్నారు కంగనా సిస్టర్స్. చాన్స్ దొరికినా చాన్స్ తీసుకొనైనా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద అంశం మీదో లేక ఏదో ఒక సెన్షేషనల్ కామెంట్ తో నీ మీడియాలో అందరికి టచ్ లో ఉంటూనే ఉంటున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ కొత్త సినిమా 'పంగా' ప్రచారంలో బిజీగా ఉంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం మీడియాతో పదే పదే ఇంట్రాక్ట్ అవుతు ప్రెస్ మీట్స్ ఇస్తూ సినిమాని బాగా ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఉంది. ఆ సమయంలో ఒక విషయంపై స్పందిస్తూ మీడియాలో నిలుస్తోంది. తాజాగా ఈమె కోహ్లీ ప్రస్థావన తీసుకు వచ్చి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

 

భారత క్రికెటర్ ..టీం ఇండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీకి నాకు చాలా మంది పోలిక పెడుతూ ఉంటారు. ఆ విషయం నిజమే అనిపిస్తుంది. కోహ్లీకి నాకు రెండు విషయాల్లో పోలిక ఉన్నట్లుగా నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుందని పోల్చుకుంది కంగన. వాటిలో మొదటిది కోహ్లీ ఎక్కువగా వివాదాలను ఎదుర్కొన్నాడు. నేను కూడా నా కెరీర్ లో వివాదాలు ఎదుర్కొన్నాను. ఇక రెండవది కోహ్లీకి చాలా దూకుడు ఎక్కువ అంటారు. అలాగే నేను కూడా ప్రతి విషయంలో కూడా దూకుడుగా ఉంటాను. అందుకే ఈ రెండు విషయాల్లో మాకు కామన్ క్వాలిటీస్ ఉన్నాయని కంగనా వెల్లడించింది.

 

అయితే ఇక్కడే కంగనా కి పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వీరాట్ కోహ్లీతో తనను తాను పోల్చుకోవడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కోహ్లీ క్రీడా జీవితంలో వివాదాలు అనేవి చాలా తక్కువ. అయినా మీ వివాదాలకు కోహ్లీ వివాదాలకు ఎక్కడైనా పోలిక ఉందా అంటున్నారు. కంగనా పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మామూలే అంటూ ఇదివరకే చాలా మంది మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక కంగనా దూకుడుతో కోహ్లీ దూకుడు పోలిక ఏంటీ అంటున్నారు. కోహ్లీ దూకుడుగా ఉండటం వల్ల ఎన్నో అద్బుత విజయాలను ఇండియాకు అందిచాడు. అంతేకాదు మాచ్ లో ఎంత ప్రెజర్ ఉన్నప్పటికి అది మొహం లో తన జట్టు మీద అసలు చూపించడని జనాలలో విపరీతమైన టెన్షన్ నెలకొన్నప్పటికి తను మాత్రం కూల్ గా చేతులు వెనక్కి పెట్టుకొని తన జట్టుని ఎంకరేజ్ చేస్తుంటాడని .. మరి కంగనా దూకుడు ఏం చేసిందో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆలోచిస్తే వందకి వెయ్యి శాతం నిజమే కదా ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: