టాలీవుడ్ లో కొంతమంది అందం అభినయం తో పాటు కావలసినంత గ్లామర్ గా కనిపించినా గాని ఎందుకనో సక్సస్ లు మాత్రం రావు. మరి ఇది వాళ్ళ బ్యాడ్ లక్కా లేక మన మేకర్స్ కి వీళ్ళు ఆనకపోవడమా అన్నది మిలియన్‌డాలర్స్ క్వశన్. నటించడం వచ్చినప్పటికి కొంతమంది హీరోయిన్ కెరీర్ ఎందుకనో నల్లేరు మీద నత్తలా సాగుతుంది. అలాంటి వాళ్ళలో నభా నటేష్ గురించి చెప్పాలి. కన్నడ లో చేసిన సినిమాకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కించుకుంది. అంటే ఈ బ్యూటీలో టాలెంట్ ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా చూసే మన టాలీవుడ్ మేకర్స్ నభా నటేష్ కి తెలుగులో సినిమా ఛాన్స్ ఇచ్చారు. 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచిన వచ్చిన హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాదు ఈ సినిమాలో నభా పర్ఫార్మెన్స్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. దాంతో నభా టాలీవుడ్ యంగ్ హీరోస్ సరసన వరసగా ఛాన్సులు వస్తాయని ఆశించింది. తనే కాదు చాలామంది ప్రేక్షకులు కూడా అదే అనుకున్నారు. కాని ఈ సినిమా తర్వాత నభాకి మళ్ళీ సినిమా ఛాన్స్ రావడానికి చాలా సమయమే పట్టింది. 

 

డేరింగ్ అండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రాం పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. ఎంతో డేర్ తో తీసిన ఈ సినిమా అందరికి మంచి హిట్ ని ఇచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఇస్మార్ట్ లో నటించిన ఇంకో హీరోయిన్ నిధి అగర్వాల్ కంటే నభా కే ఎక్కువ పేరు వచ్చింది. దాంతో నభా కెరీఎ ఊపందుకుంది. ఆ సినిమాతో పాటే కమిటయిన మాస్ రాజా రవితేజ డిస్కోరాజ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుందని టాక్ వాచింది. అయితే రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా నభాకి భయంకరమైన షాకిచ్చింది. ఈ సినిమా తర్వాత నభా రేంజ్ మారిపోతుందనుకుంటే సీన్ రివర్స్ అయింది. 

 

డిస్కోరాజా ఫ్లాప్ టాక్ రావడంతో నభా కి ఇస్మార్ట్ వచ్చిన క్రేజ్ కాస్తా తుడిచిపెట్టుకు పోయింది. వాస్తవంగా ఈ సినిమాలో నటించాలా వద్దా అన్న అనుమానంతోనే కమిటయిందట. అందుకు రెండు కారణాలు. ఒకటి రవితేజ యంగ్ హీరో కాకపోవడం ..రెండు ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా నటించడం. అయితే ఇప్పుడు ఆ రెండు కారణాలే నభా కి పెద్ద తప్పుగా కనిపిస్తున్నాయట. అందుకే ఇప్పటి నుంచి యంగ్ హీరోల తప్ప రవితేజ లాంటి సీనియర్ హీరోల సరసన నటించనని డిసైడయిందట. ఏదేమైనా నభా కి పాపం డిస్కోరాజ పెద్ద దెబ్బే అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: