ఆన్ లొకేష‌న్ షూటింగ్ జ‌రుగుతుండ‌గానే ర‌క‌ర‌కాల లీకులు మేక‌ర్స్ ని బెంబేలెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఠ‌ఫ్ టాస్క్ మాస్టార్ ఎస్.ఎస్.రాజ‌మౌళికే ఇది త‌ప్ప‌డం లేదు. 2020 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ కి సంబంధించి ఇప్ప‌టికే బోలెడ‌న్ని లీకులు బ‌య‌ట‌ప‌డ్డాయి. తార‌క్ ..చ‌ర‌ణ్ లుక్ ని కూడా దాచాల‌నుకున్నా దాచ‌లేక‌పోయారు.

 

తాజాగా ఈ సినిమాలో అత్యంత కీల‌క‌మైన పులి ఫైట్ లీకైంది. తార‌క్ పెద్ద పులితో ఫైట్ చేస్తున్న ఫోటో విజువ‌ల్ లీకైంది. దీంతో ఎస్.ఎస్.రాజ‌మౌళి వ‌ర్గం ఖంగుతింది. వెంట‌నే కాపీ రైట్ చ‌ట్టాన్ని ఉప‌యోగించి ఆ లీకేజీ ఫుటేజ్ ని తొల‌గించారు. దీంతో పెద్ద డ్యామేజీని ఆపిన‌ట్ట‌య్యింది. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ పై ఎన్నో అంచ‌నాలున్నాయి. దాదాపు 350 కోట్ల మేర బ‌డ్జెట్ ని వెచ్చించారు. ఇంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాకి లీకుల బెడ‌ద పెనుముప్పును తెస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

 

 రిలీజ్ ముందు ఈ త‌ర‌హా ముప్పు. రిలీజ్ త‌ర్వాత పైర‌సీ ముప్పును ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి లుక్ బ‌య‌ట‌కు రాకుండా జ‌క్క‌న్న ఎందుక‌నో స‌స్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. అందుకే అభిమానుల్లోనూ అత్యుత్సాహం నెల‌కొంది. లీకులు ఏవి బ‌య‌ట‌ప‌డినా వెంట‌నే అవికాస్తా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయిపోతున్నాయి. క‌నీసం ఇప్ప‌టికి అయినా జ‌క్న‌న్న నిదుర లేచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. జూలై 30 రిలీజ్ అంటే ప్ర‌మోష‌న్ మ‌రీ వీక్ గా ఉంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఈ సినిమాలో పులితో ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందంటున్నారు కాబ‌ట్టి దానిని అయినా జాగ్ర‌త్త‌గా దాచే వ్యూహం చేస్తాడేమో చూడాలి. మ‌రి ఈ చిత్రం కోసం ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అటు రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అన్ని చిత్రాలు దాదాపుగా ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఇంత భారీ బ‌డ్జ‌జెట్‌తో తెర‌కెక్కుతున్న‌ప్పుడు జాగ్ర‌త్త‌లు కూడా అదే రేంజ్‌లో తీసుకోవాలి. సినిమా గురించి ఎటువంటి స‌మాచారం బ‌య‌ట‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డని రాజ‌మౌళి సినిమాలోనే ఇంత అజాగ్ర‌త్తా.

మరింత సమాచారం తెలుసుకోండి: