డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పురి కి చిన్నప్పటినుంచే సినిమాలంటే విపరీతమైన పిచ్చి. రోజు ఉదయం లేవగానే తండ్రి ముందు ప్రత్యక్షమవడం ..తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ గారి సినిమాలోని డైలాగ్ ఒకటి చెప్పడం ..నాన్న నాకో చిన్న క్యారెక్టర్ ఇవ్వవా అని అడగడం. ఇంకోరోజు ఉదయం అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలోని  డైలాగ్ ఒకటి చెప్పడం నాన్న నకో వేశం ఇవ్వవా అని అడగడం ..ఇలా రోజు ఏదో ఒక సినిమాలోని డైలాగ్ చెప్పి నాన్న ని బ్రతిమాలేవాడు ఆకాష్. కొడుకులోని ఆసక్తిని చూసిన పూరి మొదటిసారి బుజ్జిగాడు సినిమాలో కొడుకు కూతిరిని ఒకేసారి సిల్వర్ స్క్రీన్ మీద చూపించాడు. చిన్నప్పటి హీరోగా ఆకాష్ ని అలాగే చిన్నప్పటి త్రిష గా కూతురిని చూపించాడు. మొదటి సినిమా అయినా ఇద్దరు బాగా చేశారు. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలలో ఇలాగే చిన్న చిన్న పాత్రలు పోషించాడు ఆకాష్.

 

అయితే సడన్ గా పూరి ఒకరోజు కొడుకుని పిలిచి నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరో అని షాకిచ్చాడట. వెళ్ళి ప్రిపేర్ అవ్వమని చెప్పి పూరి కంప్లీట్ గా స్క్రిప్ట్ రెడీ చేసి ఆకాష్ తో మెహబూబా సినిమాని తెరకెక్కించాడు. లాంచింగ్ సినిమా తండ్రీ కొడుకులకు అసలు కలిసి రాలేదు. సినిమా ఫ్లాప్ గా మిగిలింది. అంతేకాదు ఆకాష్ బాగా చేశాడంటూనే ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలన్న కామెంట్స్ బాగా వినిపించాయి. ఇక ఆకాష్ మళ్ళీ సినిమా ఇప్పట్లో ఉండదులే అనుకున్న ప్రేక్షకులకు మళ్ళీ తండ్రీ కొడుకులు కలిసి షాకిచ్చారు. ఆకాష్ తో రెండవ సినిమాని అనౌన్స్ చేసి పూరి నేను కొడితే ఇలానే ఉంటదని ఆళ్ళు ఈళ్ళు అనడం తప్ప నాకూ తెలీదు అన్న రెవంజ్ లో సినిమాని లాంచ్ చేశారు. పూరి కేవలం కథ మాత్రమే అందిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ పేరుతో రెడి అవుతోంది.

 

ఇక గత సంవత్సరం ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పూరి చాలా కాలం తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆయన రెంజ్ హిట్ పడటంతో ఫుల్ హ్యాపీగా ఉన్న పూరి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ క్లాప్ ఛార్మి కొట్టడం విశేషం. ముంబాయి లో ప్రారంభమైన ఈ సినిమా కంప్లీట్ గా ముంబాయి, గోవాలలో షూటింగ్ జరుపుకోనుందట. పాన్ ఇండియా సినిమాగా నాలుగు భాషల్లో ఈ సినిమా రెడి అవుతోంది. కరణ్ జోహర్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. అయితే ఆకాష్ హీరో అయినప్పటినుంచి పూరి ఛార్మి రిలేషన్ ని బాగా గమనిస్తున్నాడట. ప్రస్తుతం పూరి టూరింగ్ టాకీస్ అండ్ పూరి కనెక్ట్స్ బ్యార్స్ రెండు పూరివే అన్న విషయం తెలిసిందే. 

 

గత కొంతకాలంగా చార్మి పూరికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా రిలీజయ్యో వరకు ఛార్మి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటుందట. ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడం అంత ఈజీగా కాదు. కానీ ఛార్మి చాలా కష్టపడుతుందని పూరి కి చాలా హెల్ప్ అవుతుందని అంతేకాదు యూనిట్ లో అందరిని బాగా చూసుకుంటుందని అంటున్నారు. నిజంగా పూరికి ఛార్మి లాంటి డైనమిక్ లేడి దొరకడం గొప్ప విషయం అని అంటున్నారు. ఈ విషయంలో ఆకాష్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడట. సెట్ లో అందరిని మ్యానేజ్ చేయడం చార్మి వల్లే అవుతుందని సినిమాకోసం పూరి ఛార్మి పడే కష్టం చూసి ఆకాష్ షాకవుతున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: