పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవతారమెత్తిన యువ నటుడు విజయ్ దేవరకొండ, హీరోగా నటించిన ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన నటించిన అర్జున్ రెడ్డి అనే బోల్డ్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో, విజయ్ ఒక్కసారిగా టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అనంతరం మరొక యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో విజయ్ నటించిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో టాలీవుడ్ లో విజయ్ కు మంచి స్టార్ స్టేటస్ లభించింది. అయితే ఆ తరువాత ఆయన నటించిన సినిమాలేవీ పెద్ద సక్సెస్ కాలేదు. 

 

ఇక ఇటీవల ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ తో పాటు అతి త్వరలో ప్రారంభం కానున్న ఫైటర్ సినిమాలపై విజయ్ గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా అత్యంత భారీ ఖర్చుతో పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కనున్న ఫైటర్ సినిమాకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపికైనట్లు ఆ మధ్య టాలీవుడ్ లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే అటువంటిది ఏమి లేదని ఆమె తండ్రి బోనీ కపూర్ కొట్టిపారేశారు. 

 

ఇక ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికైనట్లు మరొక వార్త ప్రచారం అయింది. అయితే దానిపై ఆ సినిమా యూనిట్ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. కాగా ఈ ఫైటర్ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్న ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అయిన కరణ్ జోహార్, జాన్వీని హీరోయిన్ గా ఎంపిక చేయడంలో మధ్యవర్తిత్వం చేసారని, అతి త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే విజయ్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: