కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి అనే సినిమాతో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సినిమా అప్పట్లో పర్వాలేదనిపించేలా ఆడింది. ఆ తర్వాత యువ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య మూవీతో హీరోగా మంచి హిట్ అందుకున్న అల్లు అర్జున్, ఆ తరువాత నుండి వరుసగా సినిమా అవకాశాలతో స్టార్ హీరోగా మంచి హిట్స్ అందుకోవడంతో పాటు ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇక రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని బన్నీ, ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ అందుకుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు అనే చెప్పాలి. 

 

ఒకరకంగా ఆ సినిమాలో యావరేజ్ కంటెంట్ మాత్రమే ఉన్నప్పటికీ, సంక్రాంతి సీజన్ తో వరుసగా సెలవలు రావడంతో అల సినిమాకు కలెక్షన్స్ బాగా వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక మన తెలుగు సినిమా హీరోలంటేనే ఎంతో అమితమైన ప్రేమని కురిపించే ఫ్యాన్స్, వారిని ఒక్కసారి చూసినా, లేదా వారితో ఒక ఫోటో దిగినా చాలని అనుకుంటుంటారు. ఇక ఇటీవల ఒక సందర్భంలో బన్నీ కలవడానికి వచ్చిన అయన ఫ్యాన్స్ కొందరు వరుసగా ఆయనతో ఫోటోలు దిగుతూ కళ్ళకు మొక్కుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. 

 

అయితే ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు సరదాగా ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. నీతో ఫోటో దిగాలి అంటే నీ కాళ్ళకు మ్రొక్కాల్సిందేనా బన్నీ అన్నా అంటూ దానిపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, కేవలం బన్నీ మాత్రమే కాదు, చాలా మంది హీరోల ఫ్యాన్స్, తమ అభిమాన హీరోలతో ఫోటోలు దిగే సమయంలో, లేదా కలిసిన సమయంలో ఈ విధంగా కాళ్లకు మ్రొక్కడం గమనించవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: