టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మిల్కి బ్యూటీ తమన్నా, ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా సూపర్ హిట్ తో మంచి పేరు దక్కించుకుంది. ఇక ఆ తరువాత నుండి మెల్లగా అవకాశాలు అందిపుచ్చుకున్న తమన్నా, ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్, హిందీ సినిమాలు కూడా చేసింది. ఇక టాలీవుడ్ లోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించి మంచి సక్సెస్ లు అందుకున్న తమన్నాకు ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. 

 

ఇక ప్రస్తుతం ఆమె కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాక అక్కడక్కడా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తోంది. ఇక ఇటీవల కెజిఎఫ్ చాప్టర్ 1 తో పాటు కొద్దిరోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరులో కూడా స్పెషల్ సాంగ్స్ లో నటించి మంచి పేరు దక్కించుకున్న తమన్నా, ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో దట్ ఈజ్ మహాలక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇకపోతే సినిమాలతో పాటు అప్పుడప్పుడు పలు కార్యక్రమాలకు, ఓపెనింగులకు హాజరయ్యే తమన్నా

 

నేడు హైదరాబాద్ షాద్ నగర్ ఏరియా లోని మాగ్నెట్ ఇన్ఫ్రా సర్వీసెస్ అనే సంస్థ వారు నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన తమన్నా, కొంత బటర్ ఫ్లై లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ని వేసుకుని రావడం జరిగింది. ఇక ఒక్కసారిగా ఫొటోగ్రాఫర్లు అందరూ కూడా ఆమె డ్రెస్ ని అదేపనిగా ఫోటోలు తీయడం మొదలెట్టారు. కాసేపటిలో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ వైరల్ అయిన ఆమె ఫోటోలపై పలువురు ఆమె ఫ్యాన్స్ స్పందిస్తూ, తమన్నా గారు, మీరు బటర్ ఫ్లై లా ఎంత అందంగా ఉంటె మాత్రం, అచ్చం ఆ విధంగానే డ్రెస్ చేసుకుని రావడం మీకు మరింత అందాన్నిచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: