టాలీవుడ్ సినిమా పరిశ్రమకు భీభత్సం అనే సినిమాతో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన థమన్, ఆ తరువాత రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కిక్ సినిమాకు అందించిన సాంగ్స్ మంచి సక్సెస్ సాధించడంతో, థమన్ కు బాగా పేరు రావడం జరిగింది. ఇక ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన థమన్ ఆ సమయంలో అనేక సినిమాలు చేసాడు. అయితే మొదట్లో థమన్ మ్యూజిక్ పై కాపీ అనే ముద్ర పడడంతో, అల్లు అర్జున్, బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన సరైనోడు తరువాత కొంత విరామం తీసుకుని మ్యూజిక్ లో మరిన్ని మెళకువలు నేర్చుకుని వచ్చిన థమన్

 

అక్కడి నుండి కొంత వైవిధ్యంగా సాంగ్స్ కంపోజ్ చేయడం మొదలెట్టాడు. ఆ తరువాత మహానుభావుడు, తొలిప్రేమ, అరవింద సమేత, ఇక ఇటీవల అలవైకుంఠపురములో సినిమాలకు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చిన థమన్ ఖాతాలో ప్రస్తుతం చాలానే సినిమాలు ఉన్నాయి. ఇకపోతే కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో కలిసి దూకుడు, ఆగడు, బిజినెస్ మ్యాన్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసి మంచి సాంగ్స్ అందించిన తమన్, మళ్ళి ఇన్నేళ్ల గ్యాప్ తరువాత మహేష్ తదుపరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు. ఇటీవల థమన్ కంపోజ్ చేసిన అలవైకుంఠపురములో సాంగ్స్ కు విపరీతమైన అప్లాజ్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ కూడా తదుపరి మహేష్ తో ఆయన చేయబోయే సినిమాపై విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. 

 

ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు వరుసగా దేవిశ్రీతో వర్క్ చేసిన మహేష్ కు ఆయన మంచి సాంగ్స్ ఇచ్చినప్పటికీ, చాలా గ్యాప్ తరువాత థమన్ తమ హీరోతో సినిమా చేస్తుండడంతో, రాబోయే ఆ సినిమాలో సాంగ్స్ అదరగొట్టాల్సిందే అని థమన్ ని కోరుతూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక, ఈసారి మాత్రం మేము నిన్నే నమ్ముకున్నాం కాబట్టి, నీట ముంచినా పాల ముంచిన నీదే భారం అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: