ఇటీవల కెరీర్ పరంగా వరుసగా ఫ్లాప్స్ ని ఎదుర్కొంటున్న మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా డిస్కో రాజా, మొన్న ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని తీసి ఆకట్టుకున్న యువ దర్శకుడు విఐ ఆనంద్, ఈ డిస్కో రాజా సినిమా కోసం కూడా ఒక మంచి సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని కథా వస్తువుగా ఎంచుకున్నారు. వీర సినిమా తరువాత మరొక్కసారి ఈ సినిమా ద్వారా ద్విపాత్రాభినయం చేసిన రవితేజ, ఈ సినిమాలో మరొక్కసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని అలరించారు. 

 

ఇక తొలిరోజు తొలిఆట నుండి చాలా వరకు నెగటివ్ టాక్ మాత్రమే అందుకున్న ఈ సినిమాను ప్రేక్షక నాడిని పట్టేలా తీయడంలో దర్శకుడు విఐ ఆనంద్ చాలవరకు సక్సెస్ కాలేదని అంటున్నారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే సాగినప్పటికీ, సెకండ్ హాఫ్ ని ఫక్తు కమర్షియల్ యాంగిల్ లో నడపడం అనేది ఈ సినిమాకు ప్రధానంగా దెబ్బకొట్టిన అంశం అనేది మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నా మాట. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ కోసం దర్శకుడు ఆనంద్ సినిమా కథను, సెకండ్ హాఫ్ లో ఆ విధంగా కమర్షియల్ యాంగిల్ లో తీసుకెళ్లి, తాను ఎంచుకున్న మంచి సైన్స్ ఫిక్షన్ అంశానికి సరైన న్యాయం చేయలేకపోయాడని అంటున్నారు. అదీకాక సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా సీన్స్ సాగదీసినట్లు ఉండడంతో పాటు సినిమాకు థమన్ అందించిన సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదని చెప్తున్నారు. 

 

ఇక సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రలు ఎక్కువ అవడంతో పాటు నభ నటేష్ క్యారెక్టర్ కేవలం ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ కు మాత్రమే పరిమితం అయిందని విమర్శిస్తున్నారు. ఇక సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ సీన్స్ వంటివి కొంత ఆకట్టుకున్నప్పటికీ మధ్యలో రవితేజ, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కొంత ఫోర్స్డ్ గా అనిపిస్తాయని చెప్తున్నారు. మొత్తంగా రవితేజ తనకు మంచి కంబ్యాక్ ఇస్తుందనుకున్న డిస్కో రాజా మూవీ, ఆయన కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదని తేల్చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: