తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు మహానగరంలో అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. హైదరాబాదు లోనే కాకుండా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా ఈ భూకంపం చోటు చేసుకున్నట్లు భూగర్భ సర్వే వారు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదులోని బోడుప్పల్ ప్రాంతంలో ఎక్కువమంది ప్రజలు ఈ భూకంపం బారిన పడ్డారు. 

 

ఆ ప్రాంతంలోని ప్రజలు చెప్పిన దాని ప్రకారం వారి ఇంటిలోని వస్తువులు మరియు వారు పడుకొని ఉన్న మంచం ఒక్కసారిగా కదలడం మొదలు పెట్టాయట. దాదాపు ఆరు నుండి ఎనిమిది సెకండ్ల పాటు నిల్వ ఉన్న ఈ భూకంపం ప్రతి ఒక్కరిని భయబ్రాంతులకు గురి చేసింది. కొంతమంది ఇంట్లో వస్తువులు కదిలి కింద పడే సరికి దొంగలు వచ్చారు అని అనుకోగా మరికొందరికి విషయం అర్ధమయ్యి వెంటనే తమ తలను దొరికిన టేబుల్ కింద మరియు మంచం కింద దాచుకున్నారు. 

 

ఇకపోతే హైదరాబాదులోని కొద్ది ప్రాంతాల్లోని ప్రజలు అర్ధరాత్రి అని కూడా చూడకుండా భయభ్రాంతులై రోడ్ల మీదకు పరుగులు తీసినట్లు సమాచారం. అయితే భూగర్భ సర్వే ప్రకటించిన దాని ప్రకారం ఇది అంత పెద్దగా కంగారు పడవలసిన అంతా రేంజ్ లో ఏమీ రాలేదట. చాలా కొద్ది పాటి ప్రకంపనలు లోనైన భూమి చాలా చాలా మంది ప్రజలను విపరీతమైన భయానికి గురి చేసింది. రిక్టరు స్కేలు పై 2.8 గా ఈ భూకంపం నమోదు అయింది.

 

ఇకపోతే 2017 లో కొంతమంది భూగర్భ శాస్త్రవేత్తలు మరియు నిపుణులు చెప్పినది ఏమిటంటే హైదరాబాదు నగరంలో రిక్టర్ స్కేలుపై సగటు స్థాయిలో కనుక భూకంపం వచ్చినట్లయితే దానిని తట్టుకునే శక్తి ప్రజలకు లేదట. హైదరాబాదు ఉన్న కొండచరియల ప్రాంతాన్ని మరియు అక్కడ ఇళ్ళులు కట్టుకునే పద్ధతి ఇంకా వైశాల్యం దృష్ట్యా కొద్దిగా భారీ భూకంపం వస్తేనే హైదరాబాద్ నగరం మొత్తం అల్లాడి పోతుంది అని వారు చెప్పారు. ఏదేమైనా రాజధాని ప్రజలకు ఈ రోజు రాత్రి ఒక పీడ కలగానే మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: