‘సైరా’ తో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని భావించిన చిరంజీవి ‘సైరా’ కు సంబంధించిన అన్ని లెక్కలు తీరికగా చూసుకుంటే చిరంజీవికి 40కోట్ల నష్టం వచ్చిందని లెక్కలు తేలినట్లుగా గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ‘సైరా’ చిరంజీవి సొంత సినిమా కావడంతో ఈసినిమాకు సంబంధించి ఎటువంటి పారితోషికం లెక్కలలో రాయలేదు అని టాక్. ఈసినిమాకు సంబంధించి చిరంజీవి పారితోషికం కూడ కలుపుకుంటే ఈమూవీకి నష్టాలు 70కోట్ల వరకు చేరే ఆస్కారం ఉండటంతో చిరంజీవి బయటకు చెప్పుకోలేని బాధను ‘సైరా’ మిగిల్చింది అని అంటున్నారు. 

దీనితో ఈనష్టాన్ని చిరంజీవి కొరటాల మూవీ ద్వారా కవర్ చేయడానికి ఆమూవీ బడ్జెట్ ను 80కోట్లకు కుదించడమే కాకుండా ఈమూవీ ద్వారా 150కోట్ల బిజినెస్ ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాక్. దీనితో ఈమూవీని చాల వేగంగా నిర్మించి ఈ సంవత్సరం విడుదల చేసి తాను పోగొట్టుకున్న లాస్ ను రికవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న చిరంజీవి ఆలోచనలకు అన్ని మార్గాలలోను రాజమౌళి అడ్డు పడుతున్నట్లుగాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని జూలై 30న కాకుండా అక్టోబర్ 2న విడుదల చేయాలని రాజమౌళి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో వేగంగా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను పూర్తి చేసి ఈసమ్మర్ రేసుకు తీసుకు రావాలి అనుకుంటే ఇక్కడ కూడ రాజమౌళి చిరంజీవికి అడ్డు తగులుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల చిరంజీవి మూవీలో చరణ్ ఒకప్రత్యేక పాత్రను చేస్తున్న నేపధ్యంలో అతడికి సంబంధించిన సీన్స్ షూటింగ్ పార్ట్ ను ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు షూట్ చేయడానికి వీలులేదని ఇప్పటికే రాజమౌళి కొరటాలకు సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం. 

దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ నుండి బయటకు రావాలి అంటే మే దాటి పోతుంది. ఈసమస్యతో చిరంజీవి కొరటాల మూవీ సమ్మర్ రేస్ ను మిస్ అవుతోంది. లేకుంటే అక్టోబర్ లో వచ్చే దసరా కు రావాలి అనుకుంటే అక్టోబర్ 2న ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చేస్తోంది. ఆతరువాత వచ్చే దీపావళికి అమావాస్య సెంటిమెంట్ డిసెంబర్ కు పెద్దగా కలక్షన్స్ రాని పరిస్థితిలో కొరటాల చిరంజీవి మూవీకి వచ్చే ఏడాది సంక్రాంతి తప్ప మరొక దారి లేక ముందుగా వద్దాము అనుకున్నా రాజమౌళి టార్చర్ తో ద్వారాలు అన్నీ మూసుకుపోయాయి అంటూ గాసిప్పులు సందడి చేస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: