ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బు అన్న విషయం సృష్టంగా అర్ధం అవుతుంది. ఈ డబ్బు ఉంటే ఈ ప్రపంచంలో  ఏమూల అయినా సుఖంగా బ్రతవచ్చూ. ఇకపోతే సెలబ్రిటీలు, ధనవంతులు  ఏ కాస్త విరామం దొరికిన దేశాలు చుట్టి వస్తుంటారు. ముఖ్యంగా కొందరు విదేశాలకు ఎంజాయ్ కోసం వెళ్లారా, బిజినెస్ కోసం వెళ్లారా, ఆరోగ్యాన్ని అక్కడ కొనుక్కోవడాని వెళ్ళారా అనే విషయం అత్యంత గోప్యంగా ఉంచుతారు.

 

 

ఇక స్టార్ హీరోలైతే ఎక్కడికి వెళ్లిన వారి వెంట మీడియా ఉన్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు వారికి తెలియకుండానే బయటకు పొక్కుతాయి. మరికొన్ని విషయాలు వారు చెబితే గాని తెలియవు. ఇక రహస్యంగా ఎక్కడో దూరదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్న వారి రహస్య ఫోటోలు కూడా అప్పుడప్పుడు  సోషల్ మీడియాలో రావడం తెలిసిందే. ఇక తమ అభిమాన నటీ నటుల విషయాల్లో కొందరు అభిమానులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఇలాంటి వారివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న నటీ నటులు ఉన్నారు.

 

 

ఇకపోతే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీ తో విదేశాల‌కు వెళ్తుంటాడు. తాజాగా ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ విజయాన్ని స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో తన ఖాతాలో వేసుకున్న మహేష్  అలా సరదాగా కుటుంబంతో స‌హా అమెరికా చెక్కేసాడు. ఇక త‌న‌ భార్య పిల్ల‌ల‌తో రెండు నెల‌లు పాటు అమెరికాలో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తాడ‌ని అంతా చెపుతుంటే అందుకు త‌గ్గ‌ట్టే మ‌హేష్‌, నమ్రతలు పెడుతున్న‌ ఫొటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

 

 

కాని మహేష్ అమెరికా వెళ్లడానికి మరో కారణం ఉందట. అదేమంటే ఆగ‌డు సమయంలో  మోకాలికి గాయం కాగా గ‌త కొంతకాలంగా అది ఇబ్బంది పెడుతోంద‌ని, స‌రిలేరు నీకెవ్వ‌రు స‌మ‌యంలోనే ఫ్యామిలీ వైద్యుడు ప‌రిశీలించి మోకాలి ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌ని సూచించార‌ట‌.  

 

 

దీంతో  మ‌హేశ్ అమెరికాకు వెళ్లి మోకాలి ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు సిద్ద‌మయ్యాడ‌ట‌. అంతే కాకుండా అమెరికాలో రెండు నెల‌ల పాటు విశ్రాంతి తీసుకున్న అనంత‌రం ఇండియాకు వ‌చ్చిన తర్వాత కూడా  మరో రెండు నెల‌లు షూటింగ్‌ల‌కి దూరంగా ఉండే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: