మరొకసారి పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ బయటపడటంతో పవన్ తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. పవన్ కళ్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతూ ‘జనసేన’ భారతీయ జనతా పార్టీతో కలిసి ఫిబ్రవరి రెండున తలపెట్టిన ఈ లాంగ్ మార్చ్ వాయిదా పడటంతో పవన్ ఆలోచనలలోని అయోమయం మరొకసారి బయటపడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

వాస్తవానికి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కి ఉన్న క్రేజ్ మరి ఏ టాప్ హీరోకి లేదు. అతడు నటించే సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా అతడు సినిమాలలో నటించి 2 సంవత్సరాలు దాటిపోయినా ఎన్నికలలో ఒడి పోయినా ఇప్పటికీ లక్షల సంఖ్యలో పవన్ కు వీరాభిమానులు ఉన్నారు. 

అయితే ఈ అభిమానాన్ని పవన్ సక్రమంగా వినియోగించుకోలేకపోవడమే కాకుండా తన కెరియర్ లో నటించే సినిమాల విషయంలో కూడ తప్పులు చేస్తూ ఎదో ఒక మొక్కుబడికి నటిస్తున్నట్లుగా పవన్ ప్రస్తుతం అంగీకరిస్తున్న సినిమాల లిస్టు ఉంది అంటూ ఏకంగా పవన్ అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా పవన్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ తో కాని అదేవిధంగా త్వరలో ప్రారంభం కాబోతున్న క్రిష్ మూవీతో కాని పవన్ ఇమేజ్ పెరగదు సరికదా అతడి ఇమేజ్ మరింత తగ్గిపోయే ఆస్కారం ఉంది అని పవన్ అభిమానులు బయటకు చెప్పుకోలేని అభిప్రాయం. 

దీనితో ప్రస్తుతం పవన్ అంగీకరిస్తున్న సినిమాలు నటన పై అతడికి ఉన్న ఆసక్తితో అంగీకరిస్తున్నాడా లేదంటే హీరోగా కనుమరుగై పోతాను అన్న భయంతో అంగీకరిస్తున్నాడా అదీ కాదనుకుంటే పవన్ తన అవసరాల కోసం నటిస్తున్నాడా అంటూ వస్తున్న కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. దీనికితోడు రాజకీయాలలో రాజకీయ నాయకులను ఆడించే రింగ్ మాష్టర్ అవ్వాలని పవన్ చేస్తున్న ప్రయత్నాలు రకరకాలుగా రివర్స్ గేర్ లో అబాసుపాలు కావడం కూడ పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: