అల్లు అర్జున్ చరణ్ ల మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న పరిస్థితులలో వారిద్దరి మధ్య బయట పడని చిన్న గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ఆ గ్యాప్ ను బయటపడకుండా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ‘అల వైకుంఠపురములో’ మూవీ ‘రంగస్థలం’ రికార్డులను బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీ టాప్ 5 లిస్టులో చేరిపోవడానికి ఓవర్సీస్ లో చరణ్ రికార్డులను బన్నీ బ్రేక్ చేయడానికి పరోక్షంగా రవితేజా సహకరిస్తున్నాడు అంటూ జోక్స్ పడుతున్నాయి. మొన్న విడుదలైన ‘డిస్కో రాజా’ మూవీకి తెలుగు రాష్ట్రాలలో ఒక మాదిరి కలక్షన్స్ వచ్చినా ఓవర్సీస్ లో మాత్రం ‘డిస్కో రాజా’ ధియేటర్ల వైపు ప్రేక్షకులు ఎవరు వెళ్ళడం లేదు. 

దీనికితోడు ఈ మూవీకి భయకరమైన రేటింగ్స్ రావడంతో కష్టపడి ఆ సినిమాను చూసేకన్నా ‘అల వైకుంఠపురములో’ మూవీని మరొకసారి చూడటం మంచిది అని ఓవర్సీస్ ప్రేక్షకులు భావిస్తున్న పరిస్థితులలో ఈ వీకెండ్ ముగిసేసరికి ‘అల’ 3.5 మిలియన్ డాలర్లు క్రాస్ చేసి ‘రంగస్థలం’ ఓవర్సీస్ రికార్డులకు చెక్ పెడుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో చరణ్ రికార్డులు బన్నీ తుడిచి వేస్తున్నాడు అనుకోవాలి.

అయితే ఈ సంవత్సరం విడుదల అయ్యే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో రామ్ చరణ్ నటిస్తున్న పరిస్థితులలో ‘అల’ రికార్డులకు మించి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి అత్యంత భారీ కలక్షన్స్ వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ రికార్డులు ఒక్క చరణ్ కు మాత్రమే కాకుండా ఆ రికార్డులను జూనియర్ చరణ్ రాజమౌళి ల రికార్డులుగా పరిగణిస్తారు. దీనితో చిట్టిబాబు పాత్రతో చాల కష్టపడి ఏర్పరుచుకున్న చరణ్ రికార్డులను బన్నీ బ్రేక్ చేయడంతో చరణ్ బయటకు చెప్పుకోలేని సమస్య. దీనితో మెగా అభిమానులు కూడ అల్లు అర్జున్ కొనసాగిస్తున్న స్పీడ్ ను ఈర్ష్య పడుతున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: