'ఎక్కడికి పోతావు చిన్నవాడ' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా డిస్కో రాజా. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటించారు.  ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ బ్యాగ్డ్రాప్ లో రూపొందించిన ఈ సినిమాకి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. వాస్తవంగా ఈ సినిమా మీద రవితేజ ముందునుంచి మంచి నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా రవితేజ ఇప్పటివరకు ఇలాంటి జోనర్ లో సినిమా చేయలేదు. దాంతో ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందని బాగా ఆదరిస్తారని అనుకున్నారు. కానీ సీన్ రివర్సైంది.

 

 దర్శకుడు వి,ఐ ఆనంద్ ఎంచుకున్న సైన్స్ ఫిక్షన్ స్టోరీ వరకు బాగున్నప్పటికి ఎప్పటిలాగే అన్ని సినిమాల మాదిరిగానే మిగతా కథ, స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగడంతో సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికి దాన్ని రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగా రెగ్యులర్ ఫార్మాట్ లో మార్చడంతో సినిమా పక్కదారి పట్టిందని చెప్పుకుంటున్నారు. ఇక వి.ఐ.ఆనంద్ రాసుకున్న రొటీన్ ట్రీట్మెంట్ సినిమా కి పెద్ద మైనస్ గా మారింది.

 

ఇక సినిమాలో మొత్తంగా చూసుకుంటే రవితేజ పర్ఫార్మెన్స్ తప్ప చెప్పడానికి, చెప్పుకోవడానికి కొత్త విషయాలేమి లేవని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ముగ్గురు హీరోయిన్స్ గ్లామర్ గా ఉన్నప్పటికి ఆ గ్లామర్ కథకి పనికిరాదని అంటున్నారు. మొత్తంగా డిస్కోరాజ ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేశాడు. అయితే ఇంతలోనే మాస్ రాజా ఇంకో సినిమాని ప్రకటించి అందరికి షాకిచాడు. ఈ రోజు మన మాస్ రాజా పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించి మిరపకాయ్ అనిపించుకున్నాడు. ఏ స్టూడియో నిర్మిస్తున్న ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఇమతక ముందు రవితేజ-రమేష్ వర్మ కాంబినేషన్ లో వీర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: