అల్లు అరవింద్... అల్లు రామలింగయ్య గారి వారసుడిగా తెలుగు సినిమాలకు పరిచయమైన అల్లు అరవింద్ నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో  సినిమాలు నిర్మించి మరెన్నో విజయాలను సొంతం చేసుకున్నారు నిర్మాత అల్లు అరవింద్. ప్రస్తుతం హీరోలకు ఉండే క్రేజ్ కూడా నిర్మాత అల్లు అర్జున్ సొంతం. ప్రస్తుతం నిర్మాత అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ నిర్మాత గా కొనసాగుతున్నారు. అయితే తెలుగు వారు ఏ వ్యాపారంలో ఆయన తక్కువ కాదు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. ఇక దీని కోసం ఇప్పుడు టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్  సరికొత్త బిజినెస్ కోసం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. 

 

 

 ఇప్పటికే రెండు సొంత బ్యానర్ ల తో పాటు రెండు మల్టీప్లెక్స్ బిజినెస్ లో అల్లు అరవింద్ కొనసాగిస్తున్నారు. వీటిని విజయవంతంగా నిర్వర్తిస్తూ దూసుకుపోతున్నారు అల్లు అరవింద్. కాగా ప్రస్తుతం అల్లు అరవింద్ ఓ వినూత్న ఆలోచన చేశారు. కేవలం సినిమాలను మాత్రమే నిర్మించడం కాదు వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో యుగం  నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు  మించిన క్రేజ్ వెబ్ సిరీస్ లు విజయం సాధిస్తూ దూసుకుపోతున్నాయి. సినిమా రంగానికి దీటుగా వెబ్ సిరీస్ లను నిర్వహిస్తూ... అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి  డిజిటల్ స్ట్రీమింగ్ మాధ్యమాలు ముందుకు సాగుతున్నాయి. 

 

 

 ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికోసం ప్రముఖ వ్యాపార వేత్తలు అయినా మ్యాట్రిక్స్ ప్రసాద్, రామేశ్వర్ రావు భాగస్వామ్యంతో సొంతంగా ఓ డిజిటల్ మీడియా ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ  డిజిటల్ మీడియా కు అహ  అనే పేరును ఏర్పాటు చేసి ఎన్నో రకాల వెబ్ సిరీస్ లు నిర్మించడమే లక్ష్యంగా ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను  స్థాపించనున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. ఇప్పటికే ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: