‘అల వైకుంఠపురములో’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల సక్సస్ పై కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. వాస్తవానికి చాల సినిమాలు బాగున్నాయని ప్రశంసలు వస్తాయి కాని కలక్షన్స్ ఉండకపోవడం తనకు ఒక సమాధానం లేని ప్రశ్న అని అంటోంది.

దీనితో ఏ సినిమా హిట్ అవుతుంది అదేవిధంగా ఎవరి జీవితం సక్సస్ అవుతుంది అన్న విషయం ఎవరికీ తెలియదు అనీ మనకు రైట్ అనిపించింది చేసుకుంటూ పోవడమే జీవితం అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు తాను ‘ముకుంద’ సినిమాలో నటిస్తున్నప్పుడు హిట్ అవుతుందని భావించానని అదేవిధంగా తాను ఫెయిల్ అవుతుంది అనుకుని నటించిన చాల సినిమాలు సక్సస్ అయ్యాయి అంటూ ఒక వ్యక్తికి అయినా ఒక సినిమాకు అయినా మరే విషయానికి అయినా సక్సస్ మాత్రమే కొలమానం అని అంటోంది.

ప్రస్తుతం టాప్ హీరోయిన్ స్టేటస్ కు ఎదిగిన తన రేంజ్ గురించి మాట్లాడుతూ తనకు రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతున్న విషయాన్ని బయట పెట్టింది. ప్రతి వ్యక్తికి ఉన్నట్లే తన జీవితంలో కూడ ప్రెషర్స్ ఉన్నాయని చెపుతూ ఇప్పుడు వస్తున్న వరస విజయాలు తరువాత పరాజయాలు వస్తాయా అన్న భయం తనకు కూడ ఉంది అన్న విషయాన్ని బయట పెట్టింది. 

జీవితంలో సక్సస్ గురించి మాట్లాడుతూ లైఫ్ అనే ఆటలో చివరి వరకు పోరాడాలి అని నిశ్చయించుకున్న వారికే పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు కూడ వస్తుందని అల పోరాడలేని వారు చక్కగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోమని అమ్మాయిలకు సలహాలు ఇస్తోంది. ప్రతి విషయానికి అదేవిధంగా ప్రతి సంఘటనకు ఒక అర్ధం ఉంటుందని ఆ విషయాల పై మనం వ్యవహరించే విధానం బట్టే ఎవరికైనా సక్సస్ ఆధారపడి ఉంటుంది. సెటైర్లు పడతాయని విమర్శలు వస్తాయని భయపడే వారు జనంలోకి రావద్దు అని ఈ తరం అమ్మాయిలకు సలహాలు ఇస్తోంది ‘అల’ బుట్టబొమ్మ..

మరింత సమాచారం తెలుసుకోండి: