టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంత మంది కమెడియన్స్ వచ్చారు.  అయితే  సీతా కోకచిలుక మూవీతో బాలనటుడిగా  ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగిన వాళ్లలో అలీ ఒకరు. తర్వాత ఆ స్థానం దక్కించుకుంది మాస్టర్ భరత్.  వెంకీ సినిమాలో రవితేజ బ్రహ్మానందం, ఏవీఎస్, వేణు మాధవ్  లతోపాటు మాస్టర్ భరత్ కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది.  లిక్కర్  ఉన్న కూల్ డ్రింక్ ఓ కుర్రాడు తాగిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఆ తర్వాత రెడీ సినిమాలో చిట్టినాయుడు గా భరత్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు.

 

హీరో రామ్, భారత్ కు మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ప్రస్తుత భరత్ యువకుడిగా మారాడు కమెడియన్గా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలనటుడిగా ఎంట్రీ చాలా విచిత్రంగా జరిగింది అని అన్నాడు.    నేను పుట్టింది పెరిగింది చెన్నైలో మా నాన్నగారు తెలుగు వారైనప్పటికీ ఉద్యోగరీత్యా చెన్నైలో ఉండేవారు అందుకోసం నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు. అయితే తెలుగు నేర్చుకోవడానికి నేను నానా తంటాలు పడ్డాను...మొత్తానికి నేర్చుకున్నాను.   

 

చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే చాలా ఇష్టం ఈటీవీ వారు నిర్వహించే మాతృదేవోభవ సీరియల్ లో బుల్లితెర పరిచయం ఆ తర్వాత సినిమాల్లో అనుకోకుండా ఛాన్స్ రావడం జరిగింది.  అయితే నేను చేసిన 3 మూవీస్ లో ‘పంచతంత్రం’ ఫస్ట్ రిలీజ్ అయింది.   ఆ తర్వాత వరుసగా మూడు మూవీస్ రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.  చిన్నప్పుడు నా సినిమాలు చూసి చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నావని అంటు ఉండేవారు.. అయితే నేను పెద్ద అయ్యాక కాస్త ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెట్టాను.  ప్రస్తుతం మంచి పాత్రలు ఉంటే నటించి నా టాలెంట్ మరింత ప్రూవ్ చేసుకుంటున్నాను. 

మరింత సమాచారం తెలుసుకోండి: